E-Paper
Advertisement

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం.. ఒకే నెలలో 117 కేసులు నమోదు

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం.. ఒకే నెలలో 117 కేసులు నమోదు

Cyber Crime: స్వేఛ్చ బ్యూరో: సైబర్ క్రిమినల్స్ పై హైదరాబాద్ సైబర్​ క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత నెలలో వేర్వేరు రాష్ట్రాల్లో స్పెషల్​ ఆపరేషన్లు జరిపిన ప్రత్యేక బృందాలు రాష్ట్రంలో నమోదైన 26 కేసులను ఛేధించి 37మంది నిందితులను అరెస్ట్​ చేశారు. అదే సమయంలో రకరకాలుగా మోసాలు చేసి సైబర్ కేటుగాళ్లు కొట్టేసిన డబ్బులో 71.91 లక్షలను రికవరీ చేశారు. ఈ మొత్తాన్ని బాధితులకు వాపస్​ చేశారు. విస్తృత స్థాయిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా అత్యాశతో ఎంతోమంది సైబర్ క్రిమినల్స్​ ఉచ్ఛులో చిక్కి కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. దాంతోపాటు కేటుగాళ్లు డిజిటల్​ అరెస్ట్ పేర ప్రధానంగా సీనియర్ సిటిజన్లను భయపెడుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏయేటికాయేడు సైబర్​ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో వీటికి చెక్ పెట్టటానికి హైదరాబాద్ సైబర్​ క్రైం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆయా బ్యాంకులతో సమన్వయాన్ని ఏర్పరుచుకుని కేసులను దర్యాప్తు చేస్తున్నారు.

117 కేసులు నమోదు

సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్లలో జనవరిలో సైబర్ మోసాలకు సంబంధించి 117 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఏడు రాష్ట్రాల్లో స్పెషల్​ ఆపరేషన్లు జరిపారు. 26 కేసుల్లోని మిస్టరీని ఛేదించారు. వీటిలో ఇన్వెస్ట్​ మెంట్ ఫ్రాడ్​ కు సంబంధించిన కేసులు 15ఉండగా డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసులు 2 ఉన్నాయి. ఇక, సోషల్ మీడియా (సీఎస్​ఏఎం–పోక్సో) కేసులు 4, బిజినెస్​, గేమింగ్​, జాబ్​ ఫ్రాడ్ లకు సంబంధించి నమోదైన 5 కేసులు ఉన్నాయి. వీటిల్లో నిందితులుగా ఉన్న 37మంది నిందితులను అరెస్ట్ చేశారు.

65కోట్ల లావాదేవీలు..

విచారణలో నిందితులు జనం నుంచి 65కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా వెల్లడైంది. దేశవ్యాప్తంగా 86 కేసులతో వీరికి సంబంధం ఉన్నట్టుగా తెలిసింది. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 79 సిమ్​ కార్డులు, 62 డెబిట్​ కార్డులు, 57 చెక్​ బుక్కులు, ఇతర ఎలక్ట్రానిక్​ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Action Comedy OTT: దోపిడీ దొంగలకు షాక్ ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి… ఆకట్టుకుంటున్న యాక్షన్ కామెడి

సిమ్​ కార్డుల సప్లయర్లు అరెస్ట్..

అరెస్ట్​ అయిన వారిలో సైబర్​ క్రిమినల్స్ కు సిమ్ కార్డులు సప్లయ్ చేసిన వారు కూడా ఉన్నారు. యూకేలో ఇంజనీరుగా పని చేస్తున్నట్టు నమ్మించిన ఓ మహిళ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో సోషల్​ మీడియా ద్వారా పరిచయం ఏర్పరుచుకుంది. అతన్ని నమ్మించి Bakktcoin అనే ఫేక్​ క్రిప్టో కరెన్సీ ప్లాట్ ఫాంలో 11.20లక్షలు పెట్టుబడులుగా పెట్టించి నిండా ముంచింది. ఈ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం గెడ్డవలసకు చెందిన రవికిరణ్​, చోడిపల్లి గంగరాజులు సైబర్​ నేరగాళ్లకు సిమ్​ కార్డులు సమకూర్చినట్టు వెల్లడి కావటంతో వారిని అరెస్ట్ చేశారు.

సీ మిత్ర సక్సెస్​..

సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం కల్పించే లక్ష్యంతో ఇటీవల ప్రారంభించిన సీ మిత్ర సత్ఫలితాలను సాధించింది. జోనల్ సైబర్​ సెల్స్​ కు మొత్తం 1,706 ఫిర్యాదులు రాగా సీ మిత్ర చొరవతో 315 ఎఫ్ఐఆర్​ లు నమోదయ్యాయి. ఈ విభాగం ద్వారా వేర్వేరే కేసుల్లో 13మందిని అరెస్ట్​ చేసి 10.65లక్షల నగదును రికవరీ చేసి బాధితులకు ఇచ్చారు.

అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాలకు చెక్ పెట్టటానికి తాము విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తంగా ఉన్నపుడే లక్ష్యం నెరవేరుతుందని అదనపు పోలీస్​ కమిషనర్ (లా అండ్ ఆర్డర్​) ఎం.శ్రీనివాసులు చెప్పారు. ఉన్నతాధికారుల పేర్లతో వచ్చే వాట్సాప్​, సోషల్​ మీడియా మెసెజీలను నమ్మి డబ్బు ట్రాన్స్​ ఫర్​ చేయవద్దని సూచించారు. ఏపీకే ఫైళ్లు, బ్యాంకుల పేర వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్​ చేయవద్దని చెప్పారు. ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోవద్దన్నారు. అలా చేస్తే మీ ఫోన్లు సైబర్​ క్రిమినల్స్ ఆధీనంలోకి వెళ్లిపోతాయన్నారు. దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా డిజిటల్​ అరెస్టులు చేయవని చెప్పారు. సీబీఐ, ఈడీ, డీఆర్ఐ, కస్టమ్స్​ అధికారులమంటూ ఫోన్లు చేసి డిజిటల్ అరెస్ట్ పేర భయపెట్టి ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అన్నదే లేదన్నారు. సైబర్ మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930 నెంబర్​ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అలా చేస్తే సైబర్​ క్రిమినల్స్​ కొల్లగొట్టిన డబ్బు వారి చేతుల్లోకి వెళ్లిపోకుండా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇక, www.cybercrime.gov.in అన్న వెబ్ సైట్ కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ​

Also Read: Mystery thriller OTT : స్టూడెంట్ ను వేధించే టీచర్… తల్లి ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×