E-Paper
Advertisement

Traffic Police: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూల్స్ తప్పనిసరి పాటించాల్సిందే.. ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం!

Traffic Police: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూల్స్  తప్పనిసరి పాటించాల్సిందే.. ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం!
Advertisement

Traffic Police:  హైదరాబాద్ నగరంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1, 2026 నుండి డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేకుండా వాహనాలు నడిపే వారిపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీ డి. జోయల్ డేవిస్, ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ తప్పనిసరి వాహనదారులు ప్రయాణ సమయంలో ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే అసలు డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ప్రాంతీయ రవాణా శాఖ (RTA) కార్యాలయం నుండి దానిని పొందాలని సూచించారు.

Also Read: Sircilla: సిరిసిల్లలో పొలిటికల్ బాంబు.. ‘క్షమించు రామన్న.. కారుకు ఓటు వేయలేం’ అంటూ కరపత్రం వైరల్

యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు

Advertisement

ప్రమాదాల విశ్లేషణ నగరంలో జరుగుతున్న మెజారిటీ రోడ్డు ప్రమాదాల్లో, వాహనం నడుపుతున్న వ్యక్తికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని గమనించడమైనది. వాహన యజమానులకు హెచ్చరిక: తమ వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. లైసెన్స్ లేని వారికి వాహనాన్ని ఇవ్వడం నేరంగా పరిగణించబడుతుంది.

భీమా వర్తించదు

లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, సదరు వాహనానికి ఇన్సూరెన్స్ (Insurance) క్లెయిమ్ వర్తించదని, దీనివల్ల తీవ్రమైన ఆర్థిక మరియు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నగరవాసులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోరారు.

Advertisement

Also Read: Hyderabad News: పులి గోర్లు, దంతాల అక్రమ వ్యాపారం.. ఏడు పులి గోర్లు, మూడు దంతాలు స్వాధీనం!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×