E-Paper
Advertisement

Deefake AI Content: డీప్‌ఫేక్ ఏఐ కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వెంటనే తొలగించాలి..

Deefake AI Content: డీప్‌ఫేక్ ఏఐ కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వెంటనే తొలగించాలి..
Advertisement

Deefake AI Content Rules| కేంద్ర ప్రభుత్వం AIతో రూపొందించే తప్పుడు ఫోటోలు, వీడియోలు, ఆడియోలపై కఠిన చర్యలు తీసుకుంది. AI కంటెంట్ దుర్వినియోగం వల్ల ప్రజల్లో గందరగోళం, మోసాలు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ప్రభుత్వం కొత్త IT రూల్స్ జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, X వంటి అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు ఈ నియమాలు వర్తిస్తాయి.

AI కంటెంట్‌కు స్పష్టమైన లేబుల్స్ తప్పనిసరి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ AIతో చేయబడిన ఫోటోలు, వీడియోలకు స్పష్టమైన లేబుల్స్ పెట్టాలి. యూజర్లు ఒరిజినల్ కంటెంట్, AI కంటెంట్ మధ్య తేడా సులభంగా తెలుసుకోవాలి. లేబుల్స్ చిన్నగా, అస్పష్టంగా లేదా దాచి పెట్టే విధంగా ఉండకూడదు. ఒకసారి లేబుల్ వచ్చాక ఎప్పుడూ కనిపించేలా ఉండాలి. లేబుల్ తీసేయడం లేదా దాచడం పూర్తిగా నిషేధం.

డీప్‌ఫేక్ కంటెంట్‌ను 3 గంటల్లో తొలగించాలి

Advertisement

ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలు వచ్చిన 3 గంటల్లోగా డీప్‌ఫేక్, తప్పుడు AI కంటెంట్‌ను తొలగించాలి. ఆలస్యం చేస్తే IT చట్టాల కింద సదరు ప్లాట్‌ఫామ్స్ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. హానికరమైన డిజిటల్ కంటెంట్‌పై తక్షణ చర్య తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మోసపూరిత, అశ్లీల AI కంటెంట్‌ను అడ్డుకోవాలి

ప్లాట్‌ఫామ్స్ AI దుర్వినియోగాన్ని అరికట్టే కొత్త సిస్టమ్స్ తయారు చేయాలి. ఫేక్, అశ్లీల AI కంటెంట్ అప్‌లోడ్ చేయకుండా గుర్తించాలి. హానికరమైన కంటెంట్‌ను ముందే బ్లాక్ చేయాలి. మోసాలు, తప్పుడు సమాచారం, డిజిటల్ దుర్వినియోగం తగ్గించడమే ఈ కొత్త నియమాల లక్ష్యం.

ప్రతి 3 నెలలకు యూజర్లకు హెచ్చరికలు తప్పనిసరి

Advertisement

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి యూజర్లకు హెచ్చరికలు పంపాలి. AI టూల్స్ దుర్వినియోగం చేస్తే జరిమానాలు, శిక్షలు ఉంటాయని స్పష్టంగా చెప్పాలి. ఈ హెచ్చరికలు అందరికీ స్పష్టంగా కనిపించేలా చేయాలి. బాధ్యతాయుతంగా AI ఉపయోగించాలని ప్రోత్సహించాలి.

Also Read: ఆన్‌లైన్ గ్రాసరీ ఆర్డర్ చేసేవారు తస్మాత్ జాగ్రత్త.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

కొత్త రూల్స్ ఫిబ్రవరి 20 నుంచి అమలు

గత సంవత్సరం అక్టోబర్ 22న ఈ కొత్త నియమాలకు సంబంధఇంచి డ్రాఫ్ట్ విడుదల చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫైనల్ ఆర్డర్ జారీ చేసింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ కొత్త IT రూల్స్ అందరికీ తప్పనిసరి అవుతాయి. సోషల్ మీడియా సంస్థలు ఏమాత్రం మినహాయింపు లేకుండా పాటించాలి.

AI కంటెంట్ లేబులింగ్ అంటే ఏమిటి?

AI లేబుల్స్ వల్ల యూజర్లు కంటెంట్ నిజమైనదా, AIతో తయారైనదా అని సులభంగా తెలుసుకోగలరు. చాలా వైరల్ వీడియోలు ప్రజలను మోసం చేస్తున్నాయి. జంతువు మనిషిని దాడి చేసినట్లు చూపి, తర్వాత సేఫ్‌గా వదిలేసినట్లు చూపడం AIతోనే సాధ్యం. చాలా మంది ఇలాంటి తేడా గుర్తించలేరు. లేబుల్స్ వల్ల ఇలాంటి ఫేక్ కంటెంట్ స్పష్టంగా తెలుస్తుంది.

లేబుల్స్‌తో ట్రిక్స్ చేయడం నిషేధం

గతంలో ప్లాట్‌ఫామ్స్ లేబుల్స్‌ను చిన్నగా, సరిగా కనిపించకుండా ఉండే విధంగా పెట్టేవి. కొత్త రూల్స్ ప్రకారం లేబుల్స్ విజువల్ కంటెంట్‌లో కనీసం 10 శాతం స్థలం ఆక్రమించాలి. ఆడియోలో ప్లే అవుతుండగానే AI అని చెప్పాలి. లేబుల్స్ తీసేయడం, దాచడం పూర్తిగా నిషేధం. అప్‌లోడ్ ముందే AI కంటెంట్‌ను గుర్తించాలి.

సాధారణ యూజర్ల రక్షణే లక్ష్యం

ఈ కొత్త రూల్స్ సాధారణ ఇంటర్నెట్ యూజర్ల భద్రత కోసమే రూపొందాయి. ఫేక్, మోసపూరిత కంటెంట్ వల్ల మోసపోకుండా కాపాడతాయి. తప్పు సమాచారం వ్యాప్తి తగ్గుతుంది. AI దుర్వినియోగం తగ్గుతుంది. డిజిటల్ ప్రపంచంలో నమ్మకం పెరుగుతుంది. ఇంటర్నెట్ మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా మారుతుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×