Gadwal News: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల పట్టణంలో అత్యంత రద్దీగా, వ్యాపార కూడలిగా మారుతున్న కృష్ణా రోడ్డు (భీంనగర్) ఇప్పుడు చర్చనీయాంశమైంది. కృష్ణవేణి చౌరస్తా నుండి నదీ అగ్రహారం వరకు విస్తరించి ఉన్న ఈ రోడ్డులో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు చర్యలు అటు వ్యాపారుల్లో, ఇటు ప్రజల్లో పలు సందేహాలకు దారితీస్తున్నాయి. అక్రమ నిర్మాణాల తొలగింపు మంచిదే అయినా, అది పారదర్శకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య లేని, సుందరమైన భీంనగర్‌ను చూడాలన్నది అధికారుల ఆశయం అయితే, వివక్ష లేకుండా అందరి ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత వారిపై ఉంది అని పట్టణ ప్రజలు బావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా భీంనగర్ ప్రాంతం గద్వాల పట్టణానికే ఒక ఫుడ్ జోన్ గా మారిపోయింది. ఉదయం, సాయంత్రం ఎప్పుడు వెళ్లిన భీంనగర్ లో టిఫిన్లు జొన్న రొట్టెలు, చాట్ బండార్ల నుండి హోటళ్ల వరకు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉండటంతో పట్టణ ప్రజలతో పాటు పల్లె ప్రజలు కూడా ఇక్కడికే పోటెత్తుతున్నారు. ప్రముఖ హాస్పిటల్స్ కూడా ఇక్కడే కొలువుదీరడంతో నిత్యం రద్దీగా ఉంటోంది.
విశాలంగా ఉండే కృష్ణా రోడ్డును కొందరు యజమానులు తమ సొంత ఆస్తిగా భావించి అక్రమంగా రోడ్డు మీదకు షెడ్లు వేయడం, డబ్బాలను ఏర్పాటు చేసి వేల రూపాయలకు కిరాయిలకు ఇచ్చుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. విశాలమైన రోడ్లు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. అంతే కాకుండా షాపుల ముందు అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలంలో వర్షపు నీరు పోకుండా గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
Also Read: బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా.. కేటీఆర్!
భీంనగర్ లో మొదట భీంనగర్ లోనే ఎంక్రోచ్ మెంట్ ఎందుకు ప్రారంభించారని, గద్వాల పట్టణంలో పాతబస్టాండ్, కూరగాయాల మార్కెట్, రాజీవ్ మార్గ్ వంటి ప్రాంతాల ను ఎందుకు ఎంచుకోలేదని అందరి మెదడులో వెలుగుతున్న ప్రశ్న! భీంనగర్ లో అక్రమ షెడ్లను, నిర్మాణాలు తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విజయవంతం చేయాలనద్దే అధికారుల ఆలోచన. భీంనగర్ ను ఆదర్శంగా తీసుకొని మిగత ప్రాంతాలకు విస్తరించాలనదీ అధికారుల ప్రణాళిక అని తెలుస్తోంది.
గత కొన్నేండ్లుగా వర్షాకాలపు సీజన్ లో కురిసిన వర్షాలకు భీమ్ నగర్ లో యూనియన్ బ్యాంక్ ముందు వర్షపు నీరు నిలిచిపోయి రోడ్లు గుంతలుగా మారి ప్రజలు , వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. గుంతలుగా మారిన రోడ్లను మరమ్మతులు నోచుకోలేక స్థానికులే గుంతలను పూడ్చారు. ఇలా వర్షాకాలంలో భీంనగర్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్థానికులు అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పాపాన పోలేదు. దీనికి తోడు గద్వాలలోని శ్రీసంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నెలరోజుల పాటు చిన్నజాతర జరుగుతోంది.
అనేక సంవత్సరాలుగా ఈ చిన్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు(మిఠాయి, ఆటవస్తవులు , వంటసామాగ్రి, ఇతర దుకాణాలు) దుకాణాలు వేసి జీవనం పొందేవారు. గత సంవత్సరం మా షాపుల ముందు దుకాణాలు వేసుకోవద్దని యజనానులు హుక్కుం జారీ చేయడంతో చిరువ్యాపారుల కడుపు కొట్టినట్లయింది. ఈ క్రమంలో స్థానిక బిల్డింగ్ ఓనర్లు జాతర ఇక్కడ కొనసాగించొద్దని కోర్టు మెట్లు ఎక్కిన దాఖలున్నాయి. ఆనవాయితిగా వస్తున్న జాతరపై కొందరు బిల్డింగ్ ఓనర్లు జాతర జరిగకుండా ఆపడంతో ఈ రాద్దంతం పట్టణం మొత్తం పాకింది. ఇలా అనేక కారణాలు ఈ రోడ్డు అక్రమణల తొలగింపునకు ఆజ్యం పోసిందని చెప్పుకోవచ్చు.
Also Read: దౌల్తాబాద్‌లో దారుణం.. అప్పు పేరుతో అర్దరాత్రి పండించిన పంట చోరీ!
పాత బస్టాండ్, కూరగాయల మార్కెట్, రాజీవ్ మార్గ్ వంటి ప్రాంతాలను వదిలి అధికారులు భీంనగర్‌నే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న సామాన్యుల్లో మెదులుతోంది. అయితే, దీనిపై అధికారుల వాదన మరోలా ఉంది. భీంనగర్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి, ఇక్కడ ఆక్రమణలను ముందే అరికట్టి ‘ఆదర్శ రోడ్డుగా తీర్చిదిద్దాలని, ఆ తర్వాత ఈ విధానాన్ని పట్టణమంతా విస్తరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్నిచోట్ల మాత్రమే కూల్చివేతలు జరగడంపై “ఎవరి మెప్పు కోసం ఈ చర్యలు?” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, భీంనగర్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్లు (16,17,18,19 వార్డు) అక్రమణలు తొలగిస్తుంటే ఏ మేరకు అక్రమణలు తొలగిస్తున్నారు అని కనీసం సందర్శించిన దాఖలు లేవు. రెండు రోజుల నుంచి మున్సిపల్ అధికారుల చేపట్టిన అక్రమణల తొలగింపు బాధితుల పక్షాన నిలబడతారా లేక అధికారుల చర్యలకు మద్దతు తెలుపుతారా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
Also Read: చదువుకున్నోడికి చావు దెబ్బ.. నీట్ కుంభకోణంపై యువజన కాంగ్రెస్ సమర శంఖం!