CM Revanth: పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఘటనాస్థలికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి . ప్రమాదస్థలి పరిశీలన తర్వాత ధృవ హాస్పిటల్‌కు సీఎం వెళ్లి.. గాయపడ్డ వారి పరిస్థితిపై వైద్యులతో మాట్లాడనున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. నిన్నటి నుంచి ఘటనా స్థలిలోనే కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌తో పాటు జిల్లా అధికారులు అక్కడే ఉన్నారు. నాలుగు ఇటాచి ప్రొక్లెయినర్లతో భవనాల శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో SDRF, సింగరేణి టీమ్స్ పాల్గొన్నా యి.
Also Read: రాజాసింగ్ రాజీనామా! కేసీఆర్ చెంతకు?
పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 42కు చేరింది. మృతుల సంఖ్య 55 కు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పోందుతున్న వారిలో 11 మందికి విషమంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి అక్కడ జరుగుతున్న సహాయ చర్యల గురించి సంబంధిత వివరాలను తెలుసుకుంటునే ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత, హస్పిటల్‌లో గాయపడ్డవారిని పరామర్శిస్తారు. అలాగే వైద్యులతో వారి పరిస్థితులపై మాట్లడతారు.
పాశమైలారం ఘటన తీవ్ర విషాదకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు . మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం అందచేసేలా చూస్తామన్నారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి . పాశమైలారం ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు . ప్రమాదానికి కారకులైన వారందరిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.