BigTV English

Fridge Extra Ice: ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోయిందా ? ఈ టిప్స్ పాటిస్తే..ప్రాబ్లమ్ సాల్వ్

Fridge Extra Ice: ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోయిందా ? ఈ టిప్స్ పాటిస్తే..ప్రాబ్లమ్ సాల్వ్

Fridge Extra Ice: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్ళలో ఫ్రిజ్‌లను వాడుతున్నారు. ప్రతి రోజు ఫ్రిజ్‌లో వివిధ రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్ నిల్వ చేస్తుంటారు. అయితే ఫ్రిజ్ వాడకంలో వచ్చే ఒక సాధారణ సమస్య ఏమిటంటే డీఫ్ ఫ్రీజ్‌లో గడ్డకట్టిన మందపాటి ఐస్. ఈ పొర క్రమంగా చాలా పేరుకుపోతుంది. ఫలితంగా డీప్ ఫ్రిజ్‌లో ఎలాంటి పదార్థాలు ఉంచడానికి స్థలం ఉండదు. అంతే కాకుండా కూలింగ్ కూడా సరిగ్గా పనిచేయదు. ఇది మాత్రమే కాదు.. ఇది కరెంట్ వాడకాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా ఫ్రిజ్‌ కూడా తొందరగా పాడవుతుంది.


ఇలాంటి సమయంలో చాలా మంది ఐస్ దానంతట అదే కరిగి పోతుందని అనుకుంటారు. కాని అజాగ్రత్త కారణంగా.. ఆ ఐస్ డీప్ ఫ్రిజ్‌లో పేరుపోతుంది. ఇలాంటి పరిస్థితిలో.. నిమిషాల్లో గడ్డ కట్టిన ఐస్ ను తొలగించడానికి కొన్ని సులభమైన, సురక్షితమైన హోం రెమెడీస్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఫ్రిజ్‌కు ఎలాంటి నష్టం జరగకుండా శుభ్రం చేసే 5 ప్రభావ వంతమైన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్ ఆపేయండి:
ఫ్రిజ్ ఆపేసి డోర్స్ తెరచి ఉంచడం సురక్షితమైన మార్గం. కరిగిన ఐస్ నుంచి నీటిని సేకరించడానికి ఫ్రిజ్ కింద ఒక టవల్ లేదా కంటైనర్ ఉంచండి. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కానీ పూర్తిగా ఇది సురక్షితం.


వేడి నీటిని వాడండి:
ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని ఫ్రీజ్ లోపల ఉంచండి. తర్వాత ఫ్రిజ్ డోర్స్ క్లోజ్ చేయండి. వేడి నీటి ఆవిరి ఐస్ ను వేగంగా కరిగిస్తుంది. మంచు చాలా గడ్డ కట్టినట్లయితే.. ఒక టవల్‌ను వేడి నీటిలో నానబెట్టి, కొంత సమయం పాటు ఐస్‌పై ఉంచండి. ఇది మంచును త్వరగా కరిగేలా చేస్తుంది.

హెయిర్ డ్రైయర్‌తో ఐస్ కరిగించండి:
తక్కువ సమయంలో ఐస్ కరిగించాలంటే మీరు హెయిర్ డ్రైయర్‌ ఉపయోగించవచ్చు. కానీ డ్రైయర్ కు, ఫ్రీజర్‌కు మధ్య తగినంత దూరం ఉండాలని ,డ్రైయర్‌పై నీరు పడ కూడదని గుర్తుంచుకోండి. ఈ పద్ధతి వేగవంతమైనది కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే దీనిని వాడండి.

ప్లాస్టిక్ లేదా చెక్క స్క్రాపర్ ఉపయోగించండి:
ఐస్ వదులుగా ఉంటే.. స్క్రాపర్ లేదా చెంచా వంటి ప్లాస్టిక్ వస్తువుతో దానిని సున్నితంగా తొలగించండి. కత్తి లేదా పదునైన వస్తువును ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది ఫ్రీజ్ గోడలను దెబ్బతీస్తుంది.

Also Read: వర్షాకాలంలో ఈ జ్యూస్‌లు తాగితే.. ఇన్ఫెక్షన్లు రావు !

ఫ్రిజ్‌లో ఐస్ ఏర్పడకుండా చర్యలు తీసుకోండి:
ఐస్‌ను త్వరగా తొలగించడంతో పాటు.. మళ్ళీ గడ్డ కట్టకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోండి. అంటే తలుపు సరిగ్గా మూసి వేయడం, సీల్స్ తనిఖీ చేయడం. ఫ్రీజ్ ఓవర్‌లోడ్ చేయకుండా ఉండటం. వారానికి ఒకసారి ఫ్రీజ్‌ను డీఫ్రాస్ట్ చేయండి.

పై సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఫ్రిజ్ లోని ఐస్ తొలగించవచ్చు.

Related News

Mobile Phones: మొబైల్‌తో ఇలా చేస్తున్నారా? మీరు రిస్క్‌లో ఉన్నట్లే!

Skin Allergy: స్కిన్ అలెర్జీకి కారణాలివేనట !

Weight loss: ఈజీగా బరువు తగ్గాలా ? అయితే ఈ టిప్స్ మీకోసమే !

Knot Dating: డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలే ఎక్కువట.. ఏకంగా రూ.57 వేలు చెల్లించి మరి..

Migraine: మైగ్రేన్ తగ్గడం లేదా ? ఈ టిప్స్ పాటిస్తే.. సరి !

Drumstick Leaves: వీళ్లు.. పొరపాటున కూడా మునగాకు తినొద్దు !

Big Stories

×