Raja Singh Resign: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నది. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. రాజాసింగ్ క్రమశిక్షణారహితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం తన అభిప్రాయం తెలిపింది. ఆయనలో ఏమాత్రం క్రమ శిక్షణ లేదని తేల్చేసింది. రాజీనామాపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌గా చెబుతున్నారు రాష్ట్ర నేతలు. రాజీనామాను అధిష్టానం ఆమోదిస్తుందా?లేదా? లేక.. రాజాసింగ్‌ను ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అనేది చూడాలి. హిందుత్వ భావజాలం పట్ల తన నిబద్ధతను.. కొనసాగిస్తానంటూ లేఖలో పేర్కొన్న రాజాసింగ్ విషయంలో బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
రాజాసింగ్.. తన మాటలు, చేతలతో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే. తన ఐడెంటిటి హిందూత్వ అండ్ బీజేపీ. కానీ ఇకపై తనకు ఏ పార్టీ అండ అవసరం లేదని.. కేవలం హిందూత్వానే ఊపిరిగా బతికేస్తానంటున్నారు. అనడమే కాదు.. ఏకంగా బీజేపీకి రాజీనామా కూడా చేసేశారు. దీనికి ఆయన చెబుతున్న రీజన్.. పార్టీలో సరైన పద్ధతి లేదని. అలాంటి పద్ధతి లేని పార్టీలో ఇక తాను ఉండనని.
రాజాసింగ్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం రాష్ట్ర అధ్యక్ష ఎంపిక. మాములుగా ఎప్పుడూ దూకుడుపై ఉండే రాజాసింగ్.. గత కొన్ని రోజులుగా ఈ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ లైన్ తప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నిక ఫెయిర్‌గా ఉండాలని చెబుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరును ఖరారు చేసింది. ఇది రాజాసింగ్‌కు ఆగ్రహం తెప్పించింది. అలా ఎలా డిసైడ్ చేస్తారు? నేను పోటీలో ఉంటా? దరఖాస్తు చేసుకుంటా? అంటూ మాట్లాడారు. కానీ ఆయనకు సరైన మద్దతు లభించలేదు. దీంతో మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ మొత్తం పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేశారు.
Also Read: ట్యాంకర్లలో విషం! హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ సేఫేనా? హైడ్రా ల్యాబ్ రిపోర్టులు చూస్తే..!
దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం చాలా సీరియస్‌గా ఉంది. అయితే బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. రాజాసింగ్ కేవలం బీజేపీకి రాజీనామ చేస్తారా? ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.