E-Paper
Advertisement

Jangaon Police: జ‌నగామ పోలీస్ స్టేష‌న్‌లో దారుణం.. సర్పంచ్ కేసును స్వీకరించని సీఐ సత్యనారాయణ

Jangaon Police: జ‌నగామ పోలీస్ స్టేష‌న్‌లో దారుణం.. సర్పంచ్ కేసును స్వీకరించని సీఐ సత్యనారాయణ
Advertisement

Jangaon Police: స్వేచ్ఛ బ్యూరో: ద‌ళిత మ‌హిళా స‌ర్పంచ్ అని చూడ‌కుండా కులం పేరుతో జులుం చేస్తున్నారు.. కులం పేరు పెట్టి తిడుతున్నారు.. ఇంటిమీదికి వ‌చ్చి దాడులు చేస్తున్నారు. స‌ర్పంచ్ అనే గౌర‌వం లేకుండా దూషిస్తున్నారు.. పిటిష‌న్ ఇస్తే ప‌ట్టించుకోవు.. కులం పేరుతో తిట్టిన‌వారిని వెనుకేసుకొస్తావు.. వాళ్ళ‌ను రెండు గంట‌ల్లో అరెస్ట్ చేసి బొక్క‌లో వేస్తావా.. లేకపోతే స‌స్పెండ్ అవుతావా నీవే తేల్చుకో సీఐ స‌త్య‌నారాయ‌ణ అంటూ జాతీయ ఎస్టీ క‌మీష‌న్ స‌భ్యులు జాటోత్ హుస్సేన్‌ నాయ‌క్ ఆగ్ర‌హించారు. హుస్పేన్ నాయ‌క్ జ‌నగామ పోలీస్ స్టేష‌న్‌ను సంద‌ర్శించి సీఐ స‌త్య‌నారాయ‌ణ‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌గామ మండ‌లం వెంకిర్యాల స‌ర్పంచ్ గొల్ల‌ప‌ల్లి అలేఖ్య త‌న భర్త ఈర్ల న‌వీన్‌కుమార్ తో క‌లిసి త‌మ‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును వివ‌రించారు.

సీఐ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి..

గ‌త రెండేళ్లుగా త‌న‌పై, త‌న కుటుంబంపై జ‌రుగుతున్న దాడుల‌ను, పెడుతున్న త‌ప్పుడు కేసుల‌ను, కులం పేరుతో తిడుతున్న తీరును వీడియోలు, ఆడియోల రూపంలో హుస్సేన్ నాయ‌క్‌కు వివ‌రించారు. వెంకిర్యాల గ్రామానికి చెందిన ఈర్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఈర్ల కిష‌న్‌, తాళ్ళ‌పెల్లి శివ‌రామ్ గౌడ్‌, గౌర‌బోయిన శ్రీ‌కాంత్‌, గౌర‌బోయిన ర‌జినికాంత్ లు స‌ర్పంచ్ అలేఖ్యను మాదిగ‌దాన అంటూ దూషిస్తున్నార‌ని తెలిపారు. గ‌త జ‌న‌వ‌రి 14న కులం పేరుతో దూషిస్తే సీఐ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి(CI Sathyanarayana)కి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేద‌ని, తీరా చూస్తే మాపైనే ఉల్టా కేసులు పెట్టి నోటీసులు ఇచ్చార‌ని ఆవేధ‌న చెందారు. దీంతో హుస్సేన్ నాయ‌క్ సీఐ స‌త్య‌నారాయ‌ణ రెడ్డితో మాట్లాడుతూ ఒక చ‌దువుకున్న ద‌ళిత మ‌హిళ‌, గ్రామానికి స‌ర్పంచ్‌గా ఎన్నికైంది. ఆమేను కులం పేరుతో దూషిస్తూ, మాన‌సికంగా హింసిస్తూ, ఇబ్బందుల‌కు గురి చేస్తుంటే ఎందుకు మీరు ప‌ట్టించుకోవ‌డం లేదని ప్ర‌శ్నించారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై స్కోర్ కార్డ్.. సీఎం చేతికి చేరిన సర్వే రిపోర్టు..?

కులం పేరుతో..

పిటిష‌న్లు ఇస్తే ప‌ట్టించుకోవు, కులం పేరుతో దూషిస్తే కేసు చేయ‌వు, పైగా వీళ్ళ‌పైనే కేసులు వేస్తావు. అట్రాసిటి కేసును రాంగ్ ట్రాక్ ప‌ట్టిస్తున్నావు. ఇదేమి బాగాలేదు. ఒక స‌ర్పంచ్‌ను కులం పేరుతో దూషించిన‌వారిపై కేసు నమోదు చేసి, రెండు గంట‌ల్లో అరెస్ట్ చేసి బొక్క‌లో వేయాలి లేకుంటే నీవు స‌స్పెండ్ అవుతావు. వాళ్ళ‌ను అరెస్ట్ చేసేంత వ‌ర‌కు నేను ఈ కేసును ప‌రిశీలిస్తూనే ఉంటా అంటూ సీఐ స‌త్య‌నారాయ‌ణ రెడ్డిని ఆదేశించారు. ప్ర‌జ‌లు కోరుకుంటే గెలిచిన సర్పంచ్‌ను కులం పేరుతో తిడుతుంటే మీరు ఎందుకు కేసు చేయ‌ర‌ని వారిని స్టేష‌న్‌లోకి తీసుకురాక‌పోతే నీవు డిల్లిలో ఉంటావ‌ని హుస్సేన్ నాయ‌క్ సీఐని హెచ్చ‌రించారు. దీంతో సీఐ స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ వాళ్ళు మాకు కులం పేరుతో దూషించిన‌ట్లు ఎలాంటి పిర్యాదు చేయ‌లేద‌ని బుకాయించబోగా, వెంట‌నే స‌ర్పంచ్ దంప‌తులు జ‌న‌వ‌రి 15న పోలీస్ స్టేష‌న్‌లో ఇచ్చిన పిర్యాదు ను హుస్సేన్ నాయ‌క్‌కు చూపించారు. మీరు డీసీపీకి చెప్పుకుంటావో, సీపీకి చెప్పుకుంటావో నాకు తెలువ‌దు, వాళ్ళు స్టేష‌న్‌లో ఉండాల‌ని ఆదేశించారు.

Advertisement

Also Read: RajyaSabha: తెలంగాణ రాజ్యసభ పోరు.. బీఆర్ఎస్ మైండ్ గేమ్ వెనుక అంతరార్ధం ఇదేనా?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు, ట్రీట్‌మెంట్ చేస్తున్న వైద్యులు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×