BigTV English

Malla Reddy: బీజేపీలోకి మల్లారెడ్డి?.. అంతా కేసీఆర్ డైరెక్షనేనా!?

Malla Reddy: బీజేపీలోకి మల్లారెడ్డి?.. అంతా కేసీఆర్ డైరెక్షనేనా!?

Malla Reddy: అదేంటి? మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరడం ఏంటి? పదే పదే కేసీఆర్ భజన చేసే మల్లన్న.. అంత ఈజీగా పార్టీ మారిపోతారా? కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోందంటూ తనదైన స్టైల్ లో సవాల్ చేస్తున్న మల్లారెడ్డి.. ఆ పార్టీని వీడిపోతారా? అంటే, ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని అంటున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఏదో జరగబోతోందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. మంత్రి మల్లారెడ్డిపై నగర ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మల్లారెడ్డి విషయంలో అధిష్టానం మౌనంగా ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే నిప్పు లేకుండానే పొగ వస్తోంది.


మల్లారెడ్డిపై జరిగినవి మామూలు ఐటీ దాడులు కావు. వందలాది అధికారులు ఏకకాలంలో రైడ్స్ చేశారు. రెండు రోజుల పాటు ఏదీ వదలకుండా చెక్ చేశారు. లెక్కలకు రాని వందల కోట్ల గుట్టు పట్టేశారు. కుటుంబ సభ్యులు అందరినై పక్కాగా కేసులు పెట్టారు. ఆ కేసులు ఇప్పట్లో తేలేవి కావు.. ఆ చిక్కు ఇప్పట్లో వీడేది కాదు. వాటినుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం.. బీజేపీలో చేరడం అనేది మల్లారెడ్డి భావన. బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం తనకు ఐటీ వేధింపులు తప్పవని.. సంపాదించిందంతా ఒక్కరోజులోనే కొల్లగొట్టుకుపోతున్నారనేది ఆయన ఆవేదన అంటున్నారు. కేసీఆర్ ఇప్పట్లో ప్రధాని అయ్యేది లేదు.. తనకు కేంద్రం నుంచి రక్షణ లభించేది లేదనేది మల్లారెడ్డి లెక్క. అందుకే, బీజేపీతో ఈమధ్య టచ్ లోకి వెళ్లారట మంత్రి మల్లారెడ్డి. ఇప్పుడు కాకపోయినా, ఎప్పటికైనా వచ్చేస్తానంటూ మెసేజ్ పంపించారట.

తెలంగాణలో చీమ కుట్టినా సీఎం కేసీఆర్ కు తెలిసిపోతుందని అంటారు. మల్లారెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్లిన మేటర్ సైతం కేసీఆర్ రాడార్ మీదకు వచ్చిందని అంటున్నారు. ఆ విషయం తెలిసే.. ఆయన డైరెక్షన్ లోనే.. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రిపై తిరుగుబాటు చేశారని చెబుతున్నారు. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, అంత ఓపెన్ గా మైనంపల్లి ఇంట్లోనే మీటింగ్ పెట్టుకోవడం.. ఆ తర్వాత తిరుమలలో రహస్యంగా మంతనాలు జరపడం.. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గమ్మున ఉండటం చూస్తుంటే.. అంతా ఓ ప్లాన్ ప్రకారమే మల్లారెడ్డికి చెక్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.


బీజేపీతో మల్లారెడ్డి మంతనాలు లీక్ కావడం వల్లే.. ఆయన్ను ఓ పద్దతి ప్రకారం సైడ్ చేస్తున్నానే చర్చ నడుస్తోంది. ఈ విషయం మల్లారెడ్డికి సైతం అర్థం అయిందని.. అందుకే ఆయన తన రెబెల్స్ పై పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు. మరి, మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం నిజమేనా? లేదంటే, ఇదంతా కమలనాథుల మైండ్ గేమా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×