E-Paper
Advertisement

DGP: బీఆర్ఎస్ లోకి మహేందర్ రెడ్డి!?.. ఆ పదవి పక్కానా?

DGP: బీఆర్ఎస్ లోకి మహేందర్ రెడ్డి!?.. ఆ పదవి పక్కానా?
Advertisement

DGP: డిసెంబర్ 31న డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇంచార్జి డీజీపీగా అంజనీకుమార్ ను నియమించింది ప్రభుత్వం. ఇక ఆయన్నే పూర్తిస్థాయి డీజీపీగా చేస్తారంటున్నారు. మరి, మహేందర్ రెడ్డిని ఏం చేస్తారు?

ఇటీవల హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమాండ్ సెంటర్ కోసం డీజీపీ మహేందర్ రెడ్డి బాగా శ్రమించారని.. ఈ యేడాది చివర్లో ఆయన రిటైర్ అవుతారని.. కానీ, ఆయన్ను అంత ఈజీగా వదిలిపెడతామా? అని కేసీఆర్ అన్నారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లోనే రకరకాలుగా ప్రచారం జరిగింది. మహేందర్ రెడ్డి పదవీకాలం పెంచుతారని.. ఆయన్నే డీజీపీగా కొనసాగిస్తారని.. వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ఇంఛార్జి డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఇక మహేందర్ రెడ్డి పదవిని పొడిగించే ఛాన్స్ లేదని తేలిపోయింది.

Advertisement

మరి, ఆయన్ను అంత ఈజీగా వదిలేస్తామా? అన్న కేసీఆర్ కామెంట్ల వెనుక మర్మం ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది. డీజీపీ కొనసాగింపు లేకపోతే.. ఇక అదేనా అనే ప్రచారం జరుగుతోంది. మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారంటూ టాక్.

అవును, మహేందర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించారు. మహేందర్ రెడ్డిపై కేసీఆర్ కు బాగా గురి కుదిరింది. ఆయనకు కావాలసింది ఇలాంటి నమ్మకస్తులే. అందుకే, మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని.. ఆయన సైతం ఓకే అన్నాకే.. ఇంచార్జి డీజీపీని ప్రకటించారని అంటున్నారు.

Advertisement

ఐఏఎస్, ఐపీఎస్ లు పదవీ విరమణ తర్వాత రాజకీయ పార్టీల్లో చేరడం కొత్తేమీ కాదు. గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అయితే ఏకంగా రాజీనామా చేసి మరీ గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుత డీహెచ్ శ్రీనివాస్ సైతం ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ లో చేరిపోదామా.. పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామా అని తెగ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులకే అంత ప్రాధాన్యం లభిస్తే.. ఇక డీజీపీగా చేసి, కేసీఆర్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేసిన మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడమనేది ఆశ్చర్యపోవాల్సిన విషయమే కాదంటున్నారు. తెలియాల్సిందల్లా.. ఆయనకు పార్టీలో ఏ పదవి కట్టబెట్టబోతున్నారు? ఎంపీ టికెట్ ఇస్తారా? లేదంటే, ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారా? గెలిస్తే మంత్రి పదవి కూడా ఖాయమా? అనేదే డిస్కషన్ పాయింట్.

Related News

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

Big Stories

Advertisement
×