E-Paper
Advertisement

Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!

Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!
Advertisement

Jagga Reddy: స్వేచ్చ బ్యూరో: టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు విడతలవారీగా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 400 మంది చిన్నారులకు సైకిళ్ళు పంపిణీ చేసిన జగ్గారెడ్డి శనివారం మరో 210 మంది చిన్నారులకు సైకిళ్ళు పంపిణీ చేశారు. చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా జగ్గారెడ్డి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

సైకిళ్ళు పంపిణీ..

స్థానిక పిఎస్సార్ గార్డెన్ లో ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతీ ఒక్క చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందజేశారు. ఐదు సంవత్సరాలు మొదలుకుని 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు సైకిళ్ళు అందజేశారు. చిన్నారులకు, బాలురకు, బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్ళు అందజేశారు. గత వారం టోకెన్లు ఇచ్చిన వారికి శనివారం సైకిళ్ళు పంపిణీ చేశారు.

Advertisement

Also read: Ward Meetings: అలియాబాద్‌లో ప్రజా పాలన సభలు.. మున్సిపల్ చైర్మన్ హడావుడి!

ఆందోళన పడవద్దు..

టోకెన్ లు లేని చిన్నారులకు మరోసారి సైకిల్లు పంపిణీ చేసేందుకు వీలుగా అందరి చిన్నారుల ఆధార్ కార్డు, పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తో కూడిన వివరాలు తీసుకోవాలని జగ్గారెడ్డి నిర్వాహకులకు సూచించారు. సైకిళ్ళు రాని చిన్నారులు ఎవరు ఆందోళన పడవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్ళు పంపిణీ చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్ , సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×