Yuvraj Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకొని.. దాదాపు 50 లక్షల వరకు ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించినందుకు గాను టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇవాళ ఇంగ్లాండ్, ఐర్లాండ్ టి20 లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం టీమిండి అని ప్రకటించింది బీసీసీఐ. ఇందులో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ పేరు కూడా ఉంది. ఈ క్రమంలో అభిషేక్ శర్మతో ( abhishek sharma) పాటు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తాడని అంటున్నారు. ఇదే జరిగితే ప్రత్యర్థి బౌలర్లకు నరకం కనిపించడం గ్యారంటీ అని కూడా అంచనా వేస్తున్నారు.
టీమిండియాలోకి వైభవ్ సూర్య వంశీ రాబోతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అభిషేక్ శర్మ గురువు యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ వచ్చేస్తున్నాడు.. అభిషేక్ శర్మ చాలా జాగ్రత్తగా ఆడాలని కోరారు. ఎప్పటిలాగే ఒళ్ళు మరిచి ఆడితే మాత్రం.. అభిషేక్ శర్మాను టీమిండియా నుంచి తీసి బయట పారేస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు యువరాజ్. వైభవ్ వచ్చిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఆడాలని సూచనలు చేశారు. ఒక్క మ్యాచ్ లో విఫలమైనా, అభిషేక్ శర్మను టీమిండియా నుంచి తొలగించి, లెఫ్ట్ హ్యాండ్ అయిన వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకువస్తారని అంచనా వేశారు.
అసలే బుడ్డోడు మంచి ఊపు మీద ఉన్నాడు.. వాడు వచ్చి రాగానే సెంచరీ కొట్టడం కూడా గ్యారంటీ అని జోస్యం చెప్పారు యువరాజ్. ఐర్లాండ్ తో జరిగే టి20 సిరీస్ సందర్భంగా తుది జట్టులో వైభవ్ సూర్య వంశీ ఉంటాడని అంచనా వేశారు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీకి పోటీగా పరుగులు చేయాల్సిన అవసరం అభిషేక్ శర్మ పైన ఉంటుందని తెలిపారు. ఎప్పటిలాగే మళ్లీ డకౌట్లు అవుతే మాత్రం అభిషేక్ శర్మ.. కెరీర్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. దీంతో యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 క్రికెట్ జట్టులో అద్భుతంగా రాణిస్తున్నాడు వైభవ్. అటు అభిషేక్ శర్మ టీమిండియాలో టి20 జట్టు తరఫున కూడా పర్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. కీలక మ్యాచ్ లలో మాత్రం డక్ ఔట్ అవుతున్నాడు. ఇప్పుడు వైభవ్ వచ్చాడు కాబట్టి… అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే.. బీసీసీఐ కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అభిషేక్ శర్మను పక్కకు పెట్టి 15 ఏళ్ల బుడ్డోడికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సూర్య కుమార్ యాదవ్ లాంటినే పక్కకు పెట్టిన బీసీసీఐ… అభిషేక్ శర్మను లెక్కచేయదని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
Also Read: Tanveer Ahmed: బాబర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు