E-Paper
Advertisement

భద్రాచలం ఆలయ భూముల కబ్జా.. ఏపీ మంత్రికి తెలంగాణ మంత్రి లేఖ.. ఏం రాశారంటే?

భద్రాచలం ఆలయ భూముల కబ్జా.. ఏపీ మంత్రికి తెలంగాణ మంత్రి లేఖ.. ఏం రాశారంటే?
Advertisement

Bhadrachalam Temple Lands: ఏపీ భూభాగంలోని భద్రాచలం ఆలయ భూములను అక్రమ కట్టడాల నుంచి రక్షించాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు ఏపీ దేవాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి లేఖ రాశారు. పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న రాముల వారి వందలాది ఎకరాల భూములను హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సంరక్షించాలని కొండా సురేశ లేఖలో కోరారు. ఆక్రమణదారులను అక్కడి నుంచి పంపించి.. వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

లేఖలో ఏముందంటే?

1878 అక్టోబర్ 12న రామ భక్తుడైన సోమరాజు పురుషోత్తమ దాసు తనకున్న 917 ఎకరాల భూమిని రిజిస్టర్డ్ వీలునామా ద్వారా భద్రాచలం స్వామికి బహుకరించారని కొండా సురేఖ లేఖలో తెలిపారు. నాటి నుంచి ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కులు అన్నీ దేవస్థానం పేరిటనే ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఈ భూమి ప్రస్తుతం ఏపీలోని అల్లూరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామం పరిధిలోకి వెళ్లాయని అన్నారు. సర్వే నంబర్లు 1 నుంచి 101 వరకు ఆ భూములు విస్తరించి ఉన్నాయన్నారు.

ఆలయానికి అనుకూలంగా తీర్పులు

Advertisement

ఇందులో దాదాపు 889.50 ఎకరాల భూమి కాలక్రమేణా పలువురి చేతుల్లో అక్రమ ఆక్రమణలకు గురైందని లేఖలో మంత్రి సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూములపై ఎండోమెంట్ ట్రిబ్యునల్, స్థానిక కోర్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆలయానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిందన్నారు. 2022 నవంబర్ 7న హైకోర్టు ‘రాష్ట్రీయ వానరసేన’ దాఖలు చేసిన పిల్‌, దేవస్థానం దాఖలు చేసిన రిట్ పిటిషన్ లపై కోర్టు తీర్పునిస్తూ.. ఆక్రమణదారుల నుంచి భూములను రక్షించాలని అధికారులను ఆదేశించిందన్నారు.

దేవస్థాన ఈఓపై భౌతిక దాడి

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీస్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు సహకరించడం లేదని భద్రాచల ఆలయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దేవస్థానం సిబ్బంది ఆక్రమణలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆక్రమణదారులు వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. 2025 జూలై 8న అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో దేవస్థాన ఈఓ, సిబ్బందిపై పెద్ద ఎత్తున భౌతిక దాడి కూడా జరిగిందన్నారు.

Advertisement

Also Read: నీళ్లు లేక నరకయాతన.. సహారా ఎడారిలో 49 మంది దుర్మరణం

ఏపీ మంత్రికి సురేఖ రిక్వెస్ట్

ఏపీ అధికారుల నుంచి ఎటువంటి చట్టపరమైన చర్యలు లేకపోవడంతో ఆక్రమణదారులు రాత్రికి రాత్రే అక్రమంగా ఇళ్లను నిర్మిస్తూ ఆలయానికి భారీ ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తున్నారన్నారని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆలయ అధికారులు హైకోర్టులో కంటెమ్ట్ కేసులు కూడా దాఖలు చేశారన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల సెంటిమెంట్లు, ప్రజా ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సురేఖ కోరారు. పోలవరం జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేసి స్వామివారి ఆస్తులను కాపాడి దేవస్థానానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Also Read: కేటీఆర్, కవితలపై రఘునందన్ రావు ఫైర్.. 2007లో ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నల వర్షం!

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×