E-Paper
Advertisement

Kamareddy : కామారెడ్డి బరిలో ఓసీ నేతలు.. బీసీ ఓట్లే కీలకం!

Kamareddy : ఈ సారి తెలంగాణ ఎన్నికలలో ప్రజలందరూ ఆత్రుతగా ఎదురుచూసే పోటీలలో కామారెడ్డి నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీల నుంచి ఓసీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చెప్పుకోవాలి. ఈ సారి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేయబోతున్నారు.

Kamareddy : కామారెడ్డి బరిలో ఓసీ నేతలు.. బీసీ ఓట్లే కీలకం!

Kamareddy : ఈ సారి తెలంగాణ ఎన్నికలలో ప్రజలందరూ ఆత్రుతగా ఎదురుచూసే పోటీలలో కామారెడ్డి నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీల నుంచి ఓసీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చెప్పుకోవాలి. ఈ సారి కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేయబోతున్నారు.

ప్రస్తుతం కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకు కేసీఆర్ కామారెడ్డి బరిలో దిగుతున్నారు. ఆ తరువాత కేసీఆర్‌పై కాలు దువ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. రేవంత్ కూడా కామారెడ్డితో కొడంగల్ నుంచి పోటీ చేయడం గమనార్హం. మరో ప్రధాన పార్టీ బీజేపీ తరపున కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీచేయబోతున్నారు. ఈ ముగ్గురు ఓసీ కులాలకు చెందిన వారే.

విచిత్రమేమిటంటే ఈ ఓసీ అభ్యర్థుల త్రిముఖ పోటీలో బీసీ ఓటర్లు కీలకంగా మారారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,45,798 ఓట్లు ఉన్నాయి. ఈ మొత్తం ఓటర్లలో బీసీ ఓటర్లు అందులోనూ మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్య ఉన్నారు.
నియోజకవర్గ మొత్తం సుమారు 55% ముదిరాజ్ ఓటర్లు ఉన్నారు. ముదిరాజ్ కులానికి చెందినవారి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఇప్పటికే ఈ ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు కామారెడ్డి పట్టణంలో వైశ్యులు, పద్మశాలి ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల అర్బన్ ప్రాంత ఓట్లు కూడా అవసరమే.

ఓటింగ్ శాతం పెరిగే అవకాశం
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్‌ ఇమేజ్‌ను ఢీకొనడానికి ముందువరుసలో ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యక ప్రజలలో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన నేరుగా కేసీఆర్‌పై పోటీచేయబోతున్నారు. దీంతో కామారెడ్డి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఉద్దండులు ఎన్నికల బరిలో తలపడుతున్నందున కామారెడ్డిలో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరిగితే అభ్యర్థుల తలరాతలు మారే అవకాశం కూడా ఉంటుంది.

గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఓటింగ్ శాతం 60 నుండి 75% మించి పెరగలేదు, అదే కామారెడ్డి అర్బన్ లో కూడా 70 శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరగలేదు. కేసీఆర్‌పై సవాలు విసిరిన రేవంత్ రెడ్డి బరిలో దిగడంతో ఓటింగ్ శాతం పెరిగి అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఎన్నికల ఫలితాలు అంచనాలకు మించి రావొచ్చు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×