KC VenuGopal | బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు బాద్యతా రాహిత్యం వల్లే రైతుబంధు ఆగిపోయిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.
KC VenuGopal | బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు బాద్యతా రాహిత్యం వల్లే రైతుబంధు ఆగిపోయిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.
రైతుబంధు నిధుల విడుదల నిలిచిపోవడంతో కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతుబంధు డబ్బులు రైతుల హక్కు.. కానీ హరీష్ రావు బాధ్యతారహితంగా ప్రకటన ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఇదంతా కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్‌రావు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
వారిద్దరి సంకుచిత స్వభావంతో వ్యవహరించారు.. అందుకే రైతు బంధు నిలిచిపోయిందన్నారు. ఈ పాపానికి బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేసీ వేణుగోపాల్ ట్విట్టర్‌లో హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం ఎన్నికల కమీషన్ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతించింది. కానీ రైతు బంధు పథకాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదని కఠినంగా హెచ్చరించింది. అయినా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ప్రచార కార్యక్రమాలలో రైతు బంధు ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల కమీషన్ రైతు బంధు పథకాన్ని మళ్లీ నిలిపివేసింది.