E-Paper
Advertisement

KCR Poll Affidavit : సీఎం కేసీఆర్‌కు సొంత కారు లేదు.. ఫామ్ హౌస్ ఉన్నా సెంటు భూమి లేదు..

KCR Poll Affidavit : కారు పార్టీ అధినేతకు సొంత కారు లేదు. సొంత వ్యవసాయ క్షేత్రం ఉన్నా సెంటు భూమి లేదు. ఎస్, రెండు చోట్ల నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్.. తన ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. అఫిడవిట్‌లో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

KCR Poll Affidavit : సీఎం కేసీఆర్‌కు సొంత కారు లేదు.. ఫామ్ హౌస్ ఉన్నా సెంటు భూమి లేదు..
Advertisement

KCR Poll Affidavit : కారు పార్టీ అధినేతకు సొంత కారు లేదు. సొంత వ్యవసాయ క్షేత్రం ఉన్నా సెంటు భూమి లేదు. ఎస్, రెండు చోట్ల నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్.. తన ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. అఫిడవిట్‌లో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

గులాబీ బాస్‌ సీఎం కేసీఆర్‌ తాను పోటీ చేసే రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్‌ వేశారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ రెండు చోట్ల ఒక్కరోజులోనే నామినేషన్ దాఖలు చేశారు. మంచి ముహూర్తం కావటం.. శుక్రవారంతో నామినేషన్ల సమయం ముగుస్తుండటంతో ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఎర్రవ‌ల్లి ఫామ్‌హౌస్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి వెళ్లిన కేసీఆర్ తన రెండో నియోజకవర్గంగా అక్కడ నామినేషన్ వేశారు.

Advertisement

కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన తర్వాత అక్కడే నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కోసం ఎవరేం చేశారో గుర్తు చేసుకొని.. ఆగం కాకుండా ఓటు వేయాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్.

కేసీఆర్‌ నామినేషన్‌ వేయడం కంటే.. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌ ఇప్పుడు హైలేట్‌గా నిలుస్తోంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. BRS పార్టీకి జాతీయ అధ్యక్షుడైనా కేసీఆర్‌కు సొంతంగా కారు కూడా లేదు. వ్యవసాయమే వృత్తిగా ఉన్నప్పటికీ ఆయన పేరు మీద సెంటు సాగు భూమి కూడా లేదు. ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయి. కేసీఆర్‌ వెల్లడించిన ప్రకారం ఆయన ఆస్తులను పరిశీలిస్తే.. గడచిన ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్ అయ్యాయి. గత ఎన్నికల సమయం అంటే.. 2018 డిసెంబరు నాటికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి 5 కోట్ల 63 లక్షలు నగదు ఉంటే.. ఇప్పుడు అది 11 కోట్ల 16 లక్షలకు పెరిగింది. ఇక ఆయన భార్య శోభ చేతిలో సుమారు 94 వేలు ఉంటే ఇప్పుడు అది దాదాపు 6.29 కోట్లకు పెరిగింది.

Advertisement

అయితే నాలుగు నెలల క్రితం పది ఎకరాల సాగుభూమిని.. మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో కొన్నట్లు లెక్కల్లో చూపించారు సీఎం కేసీఆర్‌. దీని విలువ సుమారు 28.47 లక్షలుగా తెలిపారు. స్థిర, చరాస్తుల రూపంలో కేసీఆర్‌కు.. 17.83 కోట్లు, 9.67 కోట్ల చొప్పున ఉంటే ఆయన భార్య పేరు మీద 7.78 కోట్ల చరాస్తులు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా 9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. అప్పుల విషయం చూస్తే కేసీఆర్ పేరు మీద 17.27 కోట్లు, కుటుంబం పేరు మీద 7.23 కోట్ల మేర అప్పులున్నాయి.

కేసీఆర్‌కు సొంతంగా కారు, బైక్ లేకపోయినా… ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలున్నట్లు పత్రాల్లో చూపించారు. వీటి విలువ కోటీ 16 లక్షలుగా తేలింది. మొత్తంగా కేసీఆర్ కుటుంబానికి 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 కరాల మేర వ్యవసాయేతర భూములున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×