E-Paper
Advertisement

BRS Failures : బీఆర్ఎస్ వైఫల్యాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

BRS Failures : బీఆర్ఎస్ వైఫల్యాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..
Advertisement
BRS party latest news

BRS party latest news(Political news in telangana) :

పదేళ్లలో కేసీఆర్‌ పాలనలో జరిగిన వైఫల్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.. మంత్రి కేటీఆర్. TSPSC, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ధరణి అంశాల్లో చేసిన తప్పులు, జరిగిన పొరపాట్లను ఆయన ఒప్పుకున్నారు. TSPSC పేపర్ల లీక్‌ అంశంలో విమర్శలు చేసిన విపక్షాలపై గతంలో ఎదురుదాడి చేసిన కేటీఆర్.. TSPSC వ్యవహారంలో పొరపాట్లు నిజమేనని ఇప్పుడు అంగీకరించారు. మనుషులన్నాక పొరపాట్లు జరుగుతాయని, మళ్లీ అధికారంలోకి వస్తే పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రవల్లిక ఆత్మహత్య విషయంలోనూ తన మాటలు తప్పేనని గతంలో ఒప్పుకున్నారు కేటీఆర్. ప్రవల్లిక అసలు TSPSC ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తే చేయలేదని ముందుగా అన్న కేటీఆర్.. ప్రవల్లిక దరఖాస్తులు, హాల్‌టికెట్ల జిరాక్స్‌ ప్రతులను బిగ్‌ టీవీ బయటపెట్టడంతో.. చివరికి తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది.

ధరణి విషయంలో అంతా బాగుందని ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తుండగా.. అందులోనూ చిక్కులు, చికాకులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మంత్రి కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తే ధరణిలో లోపాలు సరిదిద్దేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంశాల్లోనూ తమ ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్న కేటీఆర్.. తగినన్ని నిధులు లేకపోవడం వల్లే నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ చేయలేకపోయామన్నారు.

Advertisement

కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌పై చేసిన ఆరోపణల విషయంలోనూ ఆయన తన తప్పు ఒప్పుకున్నారు. హైదరాబాద్‌ ఐటీ కంపెనీలను కర్ణాటకకు తరలించేందుకు డీకే శివకుమార్‌ కుట్ర చేశారని మాట్లాడిన కేటీఆర్.. నిజాలు నిర్ధారించుకోకుండానే ఆరోపణలు చేశానంటూ తప్పు ఒప్పుకున్నారు. కేసీఆర్‌ హయాంలో జరిగిన పొరపాట్లను కేటీఆర్‌ ఒక్కొక్కటిగా కేటీఆర్ ఒప్పుకుంటుండటంతో.. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కలవరపడుతున్నాయి. బీఆర్ఎస్ చేసిన తప్పులు, జరిగిన పొరపాట్లను కేటీఆర్‌ ప్రస్తావించడం.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నష్టం చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×