E-Paper
Advertisement

KTR : అందువల్లే తెలంగాణ వచ్చింది.. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యం : కేటీఆర్

KTR : అందువల్లే తెలంగాణ వచ్చింది.. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యం : కేటీఆర్
Advertisement

KTR Latest Speech (TS News) : తెలంగాణలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లేకపోతే తెలంగాణ లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు సాగుతున్నామన్నారు.

సీఎం కేసీఆర్‌ దమ్మున్న నేత అని కేటీఆర్ అన్నారు. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి కూడా అంబేడ్కర్‌ పేరే పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. జాతికి దిశానిర్దేశం చేసేలా దాన్ని ఏర్పాటు చేశామన్నారు. స్థానికుల డిమాండ్‌ మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్‌ పేరు పెడతామని కేటీఆర్‌ ప్రకటించారు.

Advertisement

అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. బాబాసాహెబ్ స్ఫూర్తితోనే తెలంగాణలో దళితబంధు పథకం అమలు చేస్తున్నామని స్పీకర్ పోచారం అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటున్నామని స్పష్టంచేశారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×