BigTV English

Kurian Committee Review: కురియన్ కమిటీ రివ్యూ, తొలి రోజు 17మంది ఎంపీ అభ్యర్థులతో..

Kurian Committee Review: కురియన్ కమిటీ రివ్యూ, తొలి రోజు 17మంది ఎంపీ అభ్యర్థులతో..

Kurian Committee Review(TS today news): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేస్తోంది కురియన్ కమిటీ. గురువారం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంది ఈ కమిటీ. ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా గాంధీభవన్‌కు వెళ్లింది.


గెలిచిన, ఓడిన ఎంపీ అభ్యర్థులతో చర్చిస్తోంది కురియన్ కమిటీ. పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ విడివిడిగా మాట్లాడుతోంది. ఒకొక్కరికీ దాదాపు 30 నిమిషాల సమయాన్ని సమయాన్ని కేటాయించా రు. టికెట్ రాని నేతలు సైతం తమ వాదనలను కురియన్ కమిటీకి వినిపించనున్నారు. తొలుత  సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ తన వాదనలు వినింపించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు? నియోజకవర్గాల పరిధిలోని వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? అసెంబ్లీ-పార్లమెంటుకు నియోజకవర్గాల్లో ఓటింగ్ తేడా వస్తే.. ఎందుకు వచ్చింది? అనేదానిపై అభ్యర్థుల నుంచి వివరాలు సేకరిస్తోంది. రెండు లేదా మూడురోజుల పాటు కమిటీ  హైదరాబాద్‌లో మకాం వేయనుంది.


ఒక్క తెలంగాణకే కాదు.. మధ్య‌ప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిషా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలు వేసింది కాంగ్రెస్ పార్టీ. వీలైతే ఆయా నియోజకవర్గాల్లో కమిటీ పర్యటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి అంశాలతో కూడిన నివేదిక కాంగ్రెస్ హైకమాండ్‌కు అందజేయ నుంది.

ALSO READ: కేటీఆర్ ఇలా దొరికిపోతారని అనుకోలేదా?

ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీ ఎక్కడ, ఏయే విషయాల్లో వెనుకబడింది? అనేదానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఈలోగా వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను నియమించే ఛాన్స్ ఉంది. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసేందుకు అంచెలంచెలుగా చర్యలు చేపట్టనున్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకోవడంతో ఈసారి 250 సీట్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నమాట.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×