BigTV English

Heroine Samantha: ముచ్చటగా మూడోసారి, కానీ అక్కడ మాత్రం…

Heroine Samantha: ముచ్చటగా మూడోసారి, కానీ అక్కడ మాత్రం…

Gautham Menon new movie with Samantha(Film news in telugu): హీరో నాగచైతన్య, నటి సమంత జంటగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఏ మాయ చేశావే. ఈ మూవీతోనే టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది అందాల భామ సమంత. ఈ మూవీని సంచలన దర్శకుడు వాసుదేవ్ మీనన్‌ తెలుగులో లాంఛ్ చేశాడు. తన తొలి మూవీతోనే రికార్డుల మోత మోగించాడు. అంతేకాదు ఈ మూవీతోనే జెస్సీ రోల్‌ పోశించి టాలీవుడ్ కుర్రకారు మతి పోగొట్టింది. తనకు ఫస్ట్‌ మూవీ కావడం, అదే మూవీ తనకు మంచి ఐడెంటీటీ తెచ్చిపెట్టిన దర్శకుడితో తన రెండో మూవీ ఎటో వెళ్లిపోయింది మనసు మూవీలో నటించింది నటి సమంత. ఈ మూవీ తెలుగు, తమిళ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయి హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు తన కెరీర్‌లో తనకు రెండు సూపర్ హిట్ మూవీస్‌ని అందించిన దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. అందుకే వాసుదేవన్ అంటే సమంతకు ప్రత్యేక అభిమానం.


కాగా సమంత పలు అనారోగ్య కారణాల మూలంగా కొన్నాళ్ల పాటు మూవీస్‌కి బ్రేక్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యం పైన దృష్టి పెట్టి పలు చికిత్సలు తీసుకుంటూ సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం సమంత సిటాడెల్‌ వెబ్‌సిరీస్, బంగారం వంటి చిత్రాలకు మాత్రమే సంతకం చేసింది. ఇక టాలీవుడ్‌లో ఒక్క మూవీ కూడా చేయట్లేదు.ఎందుకంటే బన్నీ హీరోగా చేసిన మూవీ పుష్పలో ఐటమ్ సాంగ్‌ మంచి ఆదరణ దక్కించకోవడంతో పలు సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినా స్టోరీ, తన రోల్‌కి తగిన ఇంపార్టెన్స్ ఉన్నట్లయితే అందుకు తగ్గట్టుగా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Also Read: ఇంట్లో నుండి పారిపోయి, స్టార్‌ హీరోయిన్‌గా..?


తాజాగా నటి సమంత ఓ మలయాళం మూవీకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.తన కెరీర్‌లో రెండు మూవీస్‌ అవి కూడా సూపర్ హిట్ కావడంతో దర్శకుడితో ఏ మూవీ తీయాలన్న కూడా లేట్ చేయకుండా ఎప్పుడంటే అప్పుడు సై అనేందుకు తాను రెడీగా ఉంటానని గతంలో స్యామ్ తెలిపింది. అంతేకాకుండా తన మూవీ కెరీర్ స్టార్టింగ్‌కి పునాది వేసిన దర్శకుడిగా స్యామ్‌ సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతుంటుంది.ఇక ఇదే మ్యాటర్‌ని రివీల్ చేస్తూ తాను ఏ మూవీ తీసినా రెడీగా ఉంటానని తెలిపింది. అందులో భాగంగానే డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత ముచ్చటగా మూడోసారి యాక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు ఈ మూవీలో హీరోగా మమ్ముట్టి, సమంత కీ రోల్స్ పోశించనున్నారు. అంతేకాదు ఫస్ట్‌ టైమ్‌ ఓ మలయాళ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు దర్శకుడు గౌతమ్. ఈ మలయాళ మూవీతో గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ మరోసారి ఏ మాయ చేశావే లాంట హిట్ మూవీస్‌ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Tags

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×