Mother’s Love: మాతృ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అమ్మ పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. ఏటా మే నెలలో రెండవ ఆదివారం ఈ మాతృదినోత్సవం రోజు మాతృమూర్తుల త్యాగం, సంరక్షణ, నిస్వార్థ ప్రేమను స్మరించుకుంటాం. దీన్ని ప్రపంచంలోని అనేక దేశాల్లో విభిన్న సంప్రదాయాలతో ఆచరిస్తారు. అమ్మలందరికి కానుకలు, పుష్పాలు లేదా హృదయపూర్వక సందేశాలు ఇవ్వడం ఈరోజు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
మాతృ దినోత్సవం మూలాలు 20 వ శతాబ్దంలో అమెరికాలో ప్రారంభమయ్యాయి. అన్న జార్విస్ అనే మహిళ తన తల్లి జ్ఞాపకార్థం 1908లో ఈరోజును ప్రారంభించారు. ఇది 1914లో అధికారికంగా జాతీయ సెలవుదినంగా గుర్తించబడింది. అమ్మను ఎంతగా ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం. వివిధ భాషలలో ‘అమ్మ’ పిలుపు.. అమ్మని పిలిచే పదం ఒక్కో విధంగా ఉంటుంది. కానీ, దాని వెనుక ఉన్న భావం అంతటా ఒకటే – ప్రేమ, త్యాగం, ఆప్యాయత. కొన్ని అంతర్జాతీయత భాషలలో అమ్మని ఎలా పిలుస్తారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ – మదర్, మామ్
స్పానిష్ – మాద్రే, మామా
ఫ్రెంచ్ – మేరే , మామన్
జర్మన్ – మటర్ , మామా
ఇటాలియన్ – మాద్రే, మమ్మా
చైనీస్ – మ్యుకిన్ , మామా
జపనీస్ – హహ , ఓకాసన్
రష్యన్ – మాట్, మామా
అరబిక్ – ఉమ్ , మామా
హిందీ – మాతా , మా
తమిళ్ – అమ్మ
కొరియన్ – ఇయోమియోని, ఇయోమ్మ
ఈ పదాలు భాషల వైవిధ్యాన్ని చూపిస్తాయి, కానీ అన్ని భాషలలో ‘అమ్మ’ అనే పదం ఒకే భావనను కలిగి ఉంటుంది. జీవన దాత , సంరక్షకురాలు, ప్రేమకు మూర్తీభవనం. మాతృ దినోత్సవం ప్రాముఖ్యత మాతృ దినోత్సవం కేవలం ఒకరోజు మాత్రమే కాదు, తల్లుల జీవితంలోని ప్రతి క్షణాన్ని గౌరవించే సందర్భం. ఈరోజున, పిల్లలు తమ అమ్మలతో సమయం గడపడం, వారి కష్టాలను అర్థం చేసుకోవడం, వారి ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడం వంటివి చేస్తారు .
ఒక చిన్న కనుక, ఒక ఆలింగనం లేదా ‘నీవు నా ప్రపంచం’ అనే మాటలు తల్లి హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. మాతృ దినోత్సవం తల్లులను గౌరవించడమే కాకుండా, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈరోజున ప్రతి ఒక్కరు తమ తల్లి ప్రాముఖ్యతను త్యాగాన్ని గుర్తుచేసుకుని, ఆమె పట్ల ప్రేమను వ్యక్తం చేయాలి