Telangana Assembly: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రజా సమస్యలపై కంటే.. తమ సమస్యలు చెప్పుకోవడానికి విపక్షం ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనపై విపక్ష నేత హరీష్‌రావు నోరు విప్పారు. మాటల సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లిని తిట్టారని, ఆవేశం నాకు ఉండాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఉదయం జరిగిన ఘటనలపై మంగళవారం సభలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు, మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సంబంధించి సభలో అధికార-విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ నడుస్తోంది. మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని అవమానించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆవేశంగా మాట్లాడారు. యావత్ మహిళలపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్న హరీష్‌రావు, కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆవేశంగా అన్నారు. వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోరు విప్పారు.
హరీష్‌రావు.. ఆవేశం ఉండాల్సింది మీకు కాదు, నాకు ఆవేశం ఉండాలన్నారు స్పీకర్. ఎందుకంటే.. నా తల్లిని అన్నారని చెప్పుకొచ్చారు. నా మాటలు వినాలన్నారు. మహిళా సభ్యులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. జరిగిన ఘటన గురించి విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నా సంగతి చెప్పాలని హరీష్‌రావును ప్రశ్నించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
ఈలోగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌ను బెదిరించేలా బీఆర్‌ఎస్ సభ్యుల తీరు ఉందని, ఆ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదన్నారు. స్పీకర్‌పై బెదిరింపు ధోరణితో సభ నడవదని, సభలో ఇబ్బందులున్నట్లు గుర్తిస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని గుర్తు చేశారు. సభ మన అందరిదని, సభను ఎలా నడపాలో మీరు ఎలా చెబుతారా?
స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు వీడియోలో స్పష్టంగా కనిపించాయని, జరిగిన ఘటనలపై రికార్డులను ప్రజల ముందుంచితే స్పష్టత వస్తుందన్నారు. స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడితే తప్పని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పకుండా రాజకీయం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు.
BRS MLA హరీశ్ రావుపై స్పీకర్ ఆగ్రహం..
TG: స్పీకర్‌పై BRS MLC మధు అనుచిత వ్యాఖ్యలు, BRS మహిళా MLAలపై దాడికి సంబంధించి అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ.. ‘‘ హరీష్ రావు మీకు కాదు ఆవేశం ఉండాల్సింది. నాకు ఆవేశం… pic.twitter.com/Ly1AniBUmz
— BigTV APP (@BigtvApp) September 8, 2026