E-Paper
Advertisement

Seethakka: నెద‌ర్లాండ్ లో మంత్రి సీత‌క్క ప‌ర్య‌ట‌న‌, ఘన స్వాగతం ప‌లికిన‌ తెలుగు వాసులు

Seethakka: నెద‌ర్లాండ్ లో మంత్రి సీత‌క్క ప‌ర్య‌ట‌న‌, ఘన స్వాగతం ప‌లికిన‌ తెలుగు వాసులు
Advertisement

Seethakka:  తెలంగాణ మహిళా మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు వెళ్లారు. తాజాగా నెద‌ర్లాండ్ ( Netherlands ) దేశంలో మంత్రి సీతక్క ( Dansari Anasuya Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా నెద‌ర్లాండ్ పర్యటనకు వెళ్లిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం లభించింది. ఆమ్ స్టర్ డమ్ విమానాశ్రయంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ సభ్యులు మంత్రి సీతక్కను ఆత్మీయంగా ఆహ్వానించారు. నెద‌ర్లాండ్ దేశంలోని స్త్రీ, శిశు సంక్షేమ రంగంలో అమలవుతున్న పథకాలను పర్యవేక్షించేందుకు ఆ దేశానికి వెళ్లారు మంత్రి సీతక్క. అంతేకాదు స్త్రీ అలాగే శిశు సంక్షేమ రంగంలో భాగంగా అమ‌లు అవుతున్న పలు కార్యక్రమాలను కూడా పర్యవేక్షించనున్నారు.

Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?

Advertisement

నెదర్లాండ్ దేశంలో అమలవుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని అధ్యయనం చేసి.. తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రెండు రోజుల పాటు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై మహిళా సంక్షేమం అలాగే శిశు అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను కూడా ఈ సందర్భంగా మంత్రి సీతక్క పరిశీలిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే నెదర్లాండ్ లో పర్యటించిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం అయితే లభించింది.

అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు తెలుగు ప్రజలు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు. ఇది ఇలా ఉండ‌గా, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రెస్ స‌ర్కార్ అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తోంది. ఉచిత బ‌స్సు, ఫ్రీ క‌రెంట్‌, స‌న్న బియ్యం, త‌క్కువ ధ‌ర‌కే గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది రేవంత్ రెడ్డి స‌ర్కార్‌. ఇక ఇప్పుడు స్త్రీ, శిశు సంక్షేమ రంగంపై దృష్టి సారించింది స‌ర్కార్‌.

Advertisement

Also Read: Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫ‌ర్‌..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×