Ind vs SA, Final: టీమిండియా మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచింది టీమిండియా. ఇప్పటి వరకు మహిళల టీమిండియా ఛాంపియన్ కాలేదన్న సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 52 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా, తొలిసారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ప్రతీసారి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే విజేతలుగా నిలుస్తోన్న నేపథ్యంలో, ఈ సారి మాత్రం టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తన క్రికెట్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది. దీంతో దక్షిణాఫ్రికా కీలక దశలో చేతులు ఎత్తేసింది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా రన్నరప్ గా నిలిచింది.
Also Read: Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫర్..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే
మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్స్ జరిగింది. ఇందులో 50 ఓవర్లు ఆడిన టీమిండియా, 7 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది టీమిండియా. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా దారుణంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 101 పరుగులు చేసి, రాణించినా ఫైనల్స్ ఓడిపోయారు. చివరకు 45.3 ఓవర్లలలో 246 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నే మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 50 ఓవర్లు ఆడిన టీమిండియా ఏడు వికెట్లు నష్టపోయి, 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో స్మృతి మందాన 58 బంతులలో 45 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 87 పరుగులు చేసి, రఫ్ ఆడించింది. మొన్న సెమీ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన జమీమా 24 పరుగులకే ఔట్ అయింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులకే ఔట్ అయింది. అటు దీప్తి శర్మ 58 పరుగులతో రాణించింది. రిచా గోష్ 34 పరుగులతో దుమ్ము లేపింది.
టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన నేపథ్యంలో భారీగానే ఫ్రైజ్ మనీ రానుంది. ఐసీసీ నిబంధన ప్రకారం మహిళల వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు 40 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్స్ లో ఓడిపోయిన రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 20 కోట్ల రూపాయలు అందుతాయి. సెమీ ఫైనల్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లకు తలో 9.3 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయిన ఒక్కో జట్టుకు రూ. 5.8 కోట్లు ఇవ్వనుంది ఐసీసీ. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో తొలిసారిగా టీమిండియా ఛాంపియన్ అయిన నేపథ్యంలో రూ.125 కోట్లు ఇచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైంది. అంటే టీమిండియాకు మొత్తం రూ.165 కోట్ల ప్రైస్ మనీ రానుంది ( బీసీసీఐ, ఐసీసీ రెండు కలిపి ). దీంతో టీమిండియా ప్లేయర్లు సంబరపడిపోతున్నారు.
Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?