Smriti mandhana: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత జట్టు అద్భుతం చేసింది. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేదించి.. ఫైనల్ కి దూసుకు వెళ్లింది. అక్టోబర్ 30న నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. జమీమా రోడ్రిక్స్ {127} పరుగులతో వీరోచితంగా పోరాడి భారత్ కి విజయాన్ని అందించింది.
Also Read: Kasturi -Jemimah: జెమిమా రోడ్రిగ్స్ పై నటి కస్తూరి సీరియస్.. నీకు మెడ మీద తలకాయ ఉందా?
సెమీఫైనల్ లో అద్భుతంగా రానించి భారత జట్టును ఫైనల్ కీ చేర్చిన జమీమా ప్రదర్శన గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విజయానికి వెనుక ఉన్న ఆమె ప్రయాణం అంత సులభం కాదు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిరాశ, కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది.
గత వరల్డ్ కప్ లో జట్టులో స్థానం కోల్పోయి షాక్ కి గురైంది జమీమా. 2022 ప్రపంచ కప్ లో సెలక్షన్ కమిటీ ఆమెను ఫామ్ లో లేదన్న కారణంతో పక్కన పెట్టింది. ఆ నిర్ణయం ఆమెకు తీవ్ర దెబ్బ తగిలినట్లు అయింది. కానీ ఈసారి వరల్డ్ కప్ జట్టుకు ఎంపికై.. ప్లేయింగ్ లెవెన్ లో ఉంటానా..? ఆడితే మెరుగైన ప్రదర్శన చేస్తానా..? అనే ఆందోళనతోనే గడిపింది. కానీ భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని వీరోచితమైన, అత్యుత్తమమైన ఆటను ప్రదర్శించింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా అద్భుత ఆట తీరును ప్రదర్శించింది. ఈ వరల్డ్ కప్ లో తొలి 4 మ్యాచ్ లలో రెండుసార్లు డకౌట్ అయిన జమీమా.. మరో రెండుసార్లు 30ల్లో అవుట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ కి ఆమెను తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత న్యూజిలాండ్ పై {76*}, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ లో {127*} పరుగులు చేసి భారత్ ని ఫైనల్ కి చేర్చింది.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే విజయం సాధించడం అంత సులభమేమి కాదు. ఓ వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడం అంటే తన కళలు నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. జీవిత ప్రమాణాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. విజయం కూడా గౌరవాన్ని పెంచుతుంది. కానీ విజయం సాధించాలంటే విజయం వెనక ఎలా పరిగెత్తాలో తెలిసి ఉండాలి. అచ్చం ఇలానే జమీమా కూడా ఎన్నో కష్టాలను అనుభవించి ప్రస్తుతం తన జీవితంలో సక్సెస్ సాధించింది. అయితే సక్సెస్ సాధించిన వ్యక్తులను చూస్తే ఎవరికైనా జీవితం ఎంత బాగుందో..? అనిపిస్తుంది. ఇలా సక్సెస్ సాధించిన వారిని కొంతమంది చూసి కుళ్ళుకుంటుంటారు కూడా.
Also Read: Australia: ఆ ఒక్క తప్పిదం… ఆస్ట్రేలియాకు చుట్టుకున్న దరిద్రం.. ఇక అనుభవించాల్సిందే
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో స్మృతీ మందాన.. జమీమా వైపు చూస్తున్నట్లుగా ఉంది. అయితే కొంతమంది ఆకతాయిలు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. జెమీమా సక్సెస్ చూసి స్మృతి మందాన కుళ్ళుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు టీమిండియాలో అంతర్యుద్ధం మొదలైందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇది ఏ ఒక్కరి ఘనత కోసం ఆడే ఆట కాదు అని, దేశం కోసం, జట్టు విజయం కోసం ఆడుతున్న ఆట అని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. క్రీడాకారులు ఒకరిని చూసి మరొకరు కుళ్ళుకోవడం లాంటివి ఏమాత్రం ఉండవని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులని చెబుతున్నారు.