Suriya46 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా పరిచయమైన వెంకీ అట్లూరి తర్వాత కాలంలో రచయితగా మారాడు. ఒకవైపు రచయితగా చేస్తూనే స్నేహగీతం అనే సినిమాలో నటించాడు. వరుణ్ తేజ్, రాశి ఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీలో దర్శకుడుగా మారిపోయాడు. ఆ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన మజ్ను సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు.
ఆ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రంగ్ దే అనే సినిమాను చేశాడు. ఆ సినిమా కూడా ఊహించని సక్సెస్ ఇవ్వలేదు. అయితే అప్పటినుంచి ఆ బ్యానర్ నుంచి బయటకు రాకుండా సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు సూర్య హీరోగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరియర్ లో రాబోతున్న 46వ సినిమా అది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.
వెంకీ అట్లూరిని దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 46వ సినిమా ఓటిటి బిజినెస్ డీల్ పూర్తయిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ ఏకంగా 85 కోట్లకు ఈ సినిమా రైట్స్ కొనుక్కుంది. వాస్తవానికి ఇది చాలా మంచి రేట్ అని చెప్పాలి. ఇక సినిమా టాక్ బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన గత రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ లా ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ముందు నుంచే చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు బావుంటే తెలుగు ఆడియన్స్ ఎంతలా ఆదరిస్తారు అనడానికి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానంభవతి, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేశాయి.
ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత బైజు నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమలో సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈమె రీసెంట్ గా దేవుడు సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకుంది. కేవలం సూర్యతో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో జత కడుతుంది. విజయ్, ధనుష్ సినిమాల్లో కూడా కనిపించనుంది.
సార్, అక్కి భాస్కర్ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి కమర్షియల్ గా కూడా హిట్ అయ్యాయి. సార్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి తన స్టైల్ కంప్లీట్ గా మార్చేశాడు. తను తీసే సినిమాలు చూస్తుంటే ఇవి నిజంగా వెంకీ అట్లూరి తీసాడు అని ఫీలింగ్ కూడా కలుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు సూర్యతో చేయబోయే సినిమాతో హ్యాట్రిక్ అందుకు ఉంటాడా లేదా అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి రీసెంట్ టైమ్స్ లో ఊహించిన సక్సెస్ లు రావడం లేదు.
Also Read: Skn : మెగాస్టార్ చిరంజీవి పేరుని ఎలా వాడుకోవాలో చెప్పిన నిర్మాత ఎస్ కే ఎన్