E-Paper
Advertisement

Ice Cream: చల్లగా ఉందని తింటే తంటే.. జర జాగ్రత్త..

Ice Cream: చల్లగా ఉందని తింటే తంటే.. జర జాగ్రత్త..
Advertisement
ice cream

Ice Cream: చల్లగా ఉందని తింటే తంటే. చూట్టానికి ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. తింటే కూడా ఐస్ క్రీమ్ టేస్టే ఉంటుంది. కాస్త రేట్ తక్కువ కూడా. అలాగని తిన్నారో.. ఇక హాస్పిటల్‌లో పడాల్సిందే. కంత్రీగాళ్లు కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మండుతున్న ఎండలను.. బాగా క్యాష్ చేసుకుంటున్నారు. సిటీ పబ్లిక్‌కు.. ఐస్ క్రీమ్ గురించి బాగా ఐడియా ఉంటుంది కాబట్టి.. నగరం బయట మాత్రమే అమ్ముతున్నారు. కెమికల్స్ మిక్స్ చేసి.. ఐస్ క్రీమ్‌లా తయారుచేసి.. అంగట్లో అడ్డగోలుగా బిజినెస్ చేస్తున్నారు. అలాంటి మరో ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో కల్తీ ఐస్‌ క్రీమ్‌ ముఠాను గుట్టు రట్టు చేశారు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు. డబ్బు సంపాదనే ధ్యేయంగా.. ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ పిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు కేటుగాళ్లు.

Advertisement

అనుమతులు లేకుండానే ఐస్‌ క్రీమ్‌ కంపెనీ ఏర్పాటు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా దర్జగా కల్తీ ఐస్‌ క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పిల్లలే టార్గెట్‌గా.. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన ఐస్‌ క్రీమ్‌లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

నకిలీ ఐస్ క్రీమ్‌ల తయారీ గురించి తెలుసుకున్న సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు.. ఆ కంపెనీపై రైడ్ చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. భారీ ఎత్తున ఐస్‌క్రీమ్ తయారీ పదార్థాలను, రసాయనాలను సీజ్ చేశారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×