Big Stories

Etela: బీజేపీలో కోవర్టులు!.. ఈటల మైండ్ గేమా? ఈటలపైనే పొలిటికల్ గేమా?

Etela: బీజేపీలో కోవర్టులు ఉన్నారు. ఇదీ ఈటల రాజేందర్ స్టేట్ మెంట్. అదికూడా మీడియాతో ఇంత మాట అనేశారు. ఇదే ఛాన్స్ గా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యారు. చెప్పానా.. నేచెప్పానా.. కాషాయ పార్టీలో రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారని.. అంటూ హైప్ క్రియేట్ చేశారు. బీజేపీలో రాజేందర్ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతం అవుతున్నారంటూ మరింత మంట రాజేశారు. ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతోంది? కోవర్టులు ఉన్నారా? ఈటలను టార్గెట్ చేస్తున్నారా?

- Advertisement -

ఈటల రాజేందర్. రాజకీయాల్లో కేసీఆర్ స్థాయిలో డక్కామొక్కీలు తిన్న నాయకుడు. అలాంటి ఈటల బీజేపీలో చేరి ఏడాది కాకుండానే.. చుక్కలు చూస్తున్నారా? చూపిస్తున్నారా? అనే అనుమానం. ఇటీవల ఈటల రాజేందర్ గురించి వరుసగా లీకులు వస్తున్నాయి. బండి సంజయ్ ను తొలగించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమిస్తారని ప్రచారం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈటలనే ముఖ్యమంత్రి అవుతారంటూ మరో ప్రచారం. ఇవన్నీ ఇటు బీజేపీని, అటు ఈటలను షాక్ కు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి తనకేం సంబంధం లేదంటూ ఈటల రాజేందర్ ఇప్పటికే వివరణ కూడా ఇచ్చుకున్నారు.

- Advertisement -

అసలే క్రమశిక్షణ కలిగిన పార్టీ. కేంద్ర అధిష్టానమే ఏ నిర్ణయమైనా తీసుకునేది. అలాంటిది బీజేపీలో అంతమంది కీలక నేతలు ఉండగా.. ఈటల గురించే ఇలా వరుసగా వార్తలు రావడం వెనుక ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇదంతా చేయిస్తున్నది ఎవరు?

మూడు అవకాశాలు ఉండొచ్చంటున్నారు. కేసీఆర్ స్థాయి ఇమేజ్ ఉన్న ఈటలను బీజేపీలో మరింత ఎదగకుండా.. ఆ పార్టీకే చెందిన కొందరు కీలక నేతలు ఇలా ఈటల ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ప్రచారం చేయిస్తున్నారనే ఓ ఆరోపణ ఉంది. అది బండి సంజయ్ కావొచ్చు.. లేదంటే కిషన్ రెడ్డి అయినా అవ్వొచ్చు. బీజేపీలో గ్రూపులు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. అందులో ఏ గ్రూపు.. ఈటలను టార్గెట్ చేస్తోందో ఎవరూ చెప్పలేరు.

మరోవైపు, ఈటలనే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేయించుకుంటున్నారా? అనే అనుమానం కూడా ఉంది. బీజేపీలో వేగంగా ఎదగాలని.. ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా? అంటే కాకపోవచ్చనే అంటున్నారు. ఈటల మరీ అంత చీప్ పాలిటిక్స్ చేసే రకం కాదంటున్నారు కొందరు.

మరి, ఇంకెవరై ఉంటారంటే.. ఇదంతా బీఆర్ఎస్సే చేయిస్తోందనే మాట గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో గులాబీ పార్టీ ఎప్పుడో ఆరితేరిపోయింది. ఈటలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన గులాబీ బాస్.. బీజేపీలో ఆయన్ను బద్నామ్ చేసే లక్ష్యంతో ఇలా లీకులు ప్రచారం చేస్తున్నారనే అనుమానం ఉంది. బీజేపీ అంతర్గత విషయాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ చెవిలో వేస్తూ.. కొందరు కమల నాయకులు డబుల్ గేమ్ ఆడుతున్నారనేది ఈటల మాటల ఆంతర్యం..అంటున్నారు. రేవంత్ రెడ్డి అన్నట్టుగా.. ఈటల రాజేందర్ ఎరక్కపోయి ఇరుక్కుపోయారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News