Big Stories

Padma: చినజీయర్ తో పెద్ద మెసేజ్? పద్మాలతో కమల వికాసమా?

Padma: త్రిదండి చినజీయర్ స్వామిని పద్మభూషణ్ అవార్డు వరించింది. ఆధ్యాత్మిక, విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేస్తున్న విశేష కృషికి దేశ అత్యున్నత మూడో పురస్కారం లభించింది. ఆ అవార్డుకు ఆయన నూటికి నూరుపాళ్లు అర్హులు. భవిష్యత్తులో చినజీయర్ కు పద్మవిభూషణ్ కూడా రావాలని అంతా కోరుకుంటున్నారు.

- Advertisement -

అంతా బాగుంది. చినజీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు రావడం బహుబాగుంది. కాకపోతే, ఆ అవార్డు వచ్చిన సమయం, సందర్భమే రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది.

- Advertisement -

చాలాకాలం పాటు చినజీయర్ స్వామికి సీఎం కేసీఆర్ వీరవిధేయులు. ప్రధాన శిష్యులు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలోనే యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించింది తెలంగాణ సర్కార్. అయితే, శంషాబాద్ సమీపంలో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి ఆ గురుశిష్యుల బంధం బెడిసికొట్టిందనేది అందరికీ తెలిసిన విషయమే.

రామానుజ విగ్రహ ఆవిష్కరణలో ప్రధాని మోదీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని.. కేసీఆర్ ను పెద్దగా పట్టించుకోలేదని.. ఆఖరికి శిలాఫలకం మీద కూడా సీఎం కేసీఆర్ పేరు లేదని.. గులాబీ బాస్ బాగా హర్ట్ అయ్యారని అంటారు. అప్పటినుంచీ వారిద్దరి మధ్య మాటలు లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్. కట్ చేస్తే, చినజీయర్ స్వామి లేకుండానే యాదాద్రి కార్యక్రమం కానిచ్చేశారు కేసీఆర్.

కేసీఆర్ పట్టించుకోకపోతేనేం.. చినజీయర్ కు మేమున్నాం అనేలా బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేసిందంటున్నారు. చినజీయర్ ప్రతిష్ట మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందనే వాదన వినిపిస్తోంది. కేంద్ర నిర్ణయాన్ని అంతా హర్షించేలా.. జీయర్ స్వామికి పద్మ పురస్కారం ప్రకటించడం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News