E-Paper
Advertisement

Palakurthi Politics : గులాబీ నేతల్లో ఓటమి భయం..? అందుకేనేమో ఈ ఫ్రస్ట్రేషన్..!

Palakurthi Politics : గులాబీ నేతల్లో ఓటమి భయం..? అందుకేనేమో ఈ ఫ్రస్ట్రేషన్..!
Advertisement

Palakurthi Politics : పాలకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోయి.. చేసిన అభివృద్ధి కూడా ఏమీ లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు. దీంతో ఇక తనకు ఓటమి తప్పదని డిసైడై.. ఓటర్లను బెదిరించే కార్యక్రం మొదలు పెట్టారు. ఈసారి తనకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు అన్ని బంద్‌ చేస్తానంటున్నారు. ఓటు వేసినవారికే పెన్షన్లు, దళితబంధు, డబుల్‌బెడ్‌ రూం ఇల్లు వస్తాయని.. లేకుంటే ఏదీ ఉండదని బహిరంగంగా చెబుతున్నారు ఎర్రబెల్లి.

అయినా ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపుతామనడమేంటి.. ఇదేమైనా వారి జేబుల్లో నుంచి ఇస్తున్నారా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇక ఎర్రబెల్లి వ్యాఖ్యలతో పాలకుర్తిలో తన ఓటమిని ముందే అంగీకరించారని విమర్శులు వినిపిస్తున్నాయి. పాలకుర్తిలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డికి వస్తున్న జనాదరణతో ఎర్రబెల్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

Advertisement

ఎన్నికల్లో గెలుపుపై ఆశలు కోల్పోయిన నేతలు ఓటర్లు బెదిరించే కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రచారంలో అభ్యర్థులు గతంలో ఇచ్చిన హామీలు, చేసిన అభివృద్ధిపై చెప్పుకుంటారు. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం హామీలను తుంగలోతొక్కి.. అభివృద్ధిని అటకెక్కించడంతో ప్రజలు ప్రశ్నించడం, ఎదురుతిరగడం ప్రారంభించారు. దీంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు చేసేదేమీ లేక సంక్షేమ పథకాల పేరుతో జనాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమకు ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని లేకుంటే ఏవీ ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదనేది ఆ పార్టీ నేతల ప్రస్టేషన్‌ చూస్తుంటేనే అర్థమవుతుందంటున్నారు ప్రతిపక్ష నేతలు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×