E-Paper
Advertisement

మురిసిన బాల్యం.. సందడిగా అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా!

మురిసిన బాల్యం.. సందడిగా అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా!
Advertisement

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా వేడుకగా జరిగింది. ‘పోషణ్ పఖ్వాడా’ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేదికపై చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రాంటాల సుహాసిని గారు చిన్నారులకు అంగన్‌వాడీ ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను అందజేశారు.

Advertisement

Also Read: సోషల్ మీడియా మీ దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తోందా? దానికి కారణాలు ఇవే

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

సిడిపిఓ (CDPO) సుగుణ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘పోషణ్ పఖ్వాడా’ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం, గుడ్లు, పాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ సందడిలో అంగన్‌వాడీ సూపర్వైజర్ రమ్య, బ్లాక్ కోఆర్డినేటర్ నాగరాజు, మెప్మా ఆర్పీలు (RPs), అంగన్‌వాడీ టీచర్లు, పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. చిన్నారి పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

Also Read: అమీన్‌పూ‌ర్‌లో దర్జాగా అక్రమ కట్టడాలు.. పట్టించుకోని అధికారులు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×