E-Paper
Advertisement

Professor Kodandaram : కోదండరామ్‌కు సముచిత స్థానం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి?

Professor Kodandaram : కోదండరామ్‌కు సముచిత స్థానం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి?
Advertisement

Professor Kodandaram : టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నంది. కోదండరామ్‌కు నూతన సర్కార్‌ లో సముచిత స్థానం లభించనుంది.

కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కోదండరామ్‌ ప్రకటించడంతో టీజేఎస్‌కు సీట్లు కేటాయించలేదు. టీజేఎస్‌, కాంగ్రెస్ పార్టీల మధ్య మైత్రి బంధం కొనసాగింది.

Advertisement

కోదండరామ్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పార్టీ పెట్టిన అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు. బుధవారం సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబురాల్లో పాల్గొని, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి.

రేవంత్‌ రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కోదండరామ్‌కు కీలక పదివి దక్కనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఢిల్లీ కార్యకలాపాల్లో సహకరించిన రాజీవ్‌ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి మాజీ సీఎం కేసీఆర్‌ రప్పించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఐఏఎస్‌గా రిటైర్‌ అయిన తర్వాత శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. ఇప్పటికీ ఆయన అదే పోస్టులో ఉన్నారు. ఆయన ఆ పోస్టు నుంచి తప్పుకుంటారని చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పుకోకపోయినా ప్రభుత్వమే పంపించే అవకాశాలున్నాయి.

Advertisement

కోదండరామ్‌కు రాష్ట్ర వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో అపారమైన పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తికి సముచిత స్థానం కల్పిస్తే భాగుంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×