E-Paper
Advertisement

Half Dozen Murders: ఆరుగుర్ని చంపిన ఉన్మాది.. పోక్సోకేసులో రివేంజ్ డ్రామా, రంగారెడ్డి జిల్లాలో దారుణం

Half Dozen Murders: ఆరుగుర్ని చంపిన ఉన్మాది..  పోక్సోకేసులో రివేంజ్ డ్రామా, రంగారెడ్డి జిల్లాలో దారుణం
Advertisement

Half Dozen Murders: రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసు పెట్టారన్న కారణంతో ఓ వ్యక్తి.. ఓ ఫ్యామిలీని ఊచకోత కోశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. పోక్సో కేసు ఏంటి? అసలు ఏం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లాలో దారుణం-రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌ మండల ఈ ఘాతుకం చోటు చేసుకుంది. దైవాలగూడ గ్రామంలో శనివారం వేకువజామున ఊహించని ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని.. భార్య-ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఓ ఉన్నాది. కక్షసాధింపు చర్యతో నిందితుడు ఇదంతా చేశాడు.

Advertisement

ఆరుగుర్ని ఊచకోత కోసిన నిందితుడు-నిందితుడి పేరు రాజ్‌కుమార్, అతడి వయస్సు దాదాపు 28 ఏళ్లు. గతంలో పక్కింటి బాలికను వేధించాడనే ఆరోపణలపై రాజ్‌కుమార్‌పై బాధితురాలి తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడు. చివరకు బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చాడు రాజ్‌కుమార్.

నిందితుడిపై గతంలో పోక్సో కేసు-తనను జైలుకి పంపిన కుటుంబంపై పగ పెంచుకున్నాడు. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ కుటుంబాన్ని ఈ లోకంలో ఉంచకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున దారుణకాండకు ఒడిగట్టాడు. నిందితుడు రాజ్‌కుమార్.. రెండు వేర్వేరు ప్రాంతాల్లో మారణహోమానికి పాల్పడ్డాడు.

Advertisement

పోలీసులకు ఫోన్ చేసి నిందితుడు ఏం చెప్పాడు-ఒక ప్రాంతంలో ముగ్గురిని, మరో ప్రాంతంలో ముగ్గురిని చంపాడు. ఇవాళ నేను ఆరుగుర్ని చంపాను.. ఒకచోట ముగ్గురిని, మరొకచోట ముగ్గురిని హతమార్చాను అంటూ నిందితుడు స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. మృతుల్లో గతంలో ఫిర్యాదు చేసిన బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు.

నిందితుడు ఆ తర్వాత తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకుని అత్యంత దారుణంగా కడతేర్చాడు.  ఏడేళ్ల కిందట సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజ్‌‌కుమార్. పోలీసులకే కాదు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు నిందితుడు. కొడుకు చేసిన పనిని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌కుమార్ తన భార్యాపిల్లలను ఎందుకు హత్య చేశాడు? వాడు ఎక్కడ ఉన్నాడు? అనేదానిపై స్పష్టత రావాల్సి వుంది.

ALSO READ: ఓఆర్​ఆర్​ పై ఏఐ నిఘా.. ప్రమాదాల నివారణకు పోలీసుల మాస్టర్ ప్లాన్!

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సైబరాబాద్ సీపీ, డీసీపీలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరు హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Related News

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు

కాంగ్రెస్ నేతలు ఒసామా బిన్ లాడెన్ వారసులు.. రేవంత్ రెడ్డికి రామచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్!

దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇల్లు అమ్ముతానని రూ.31.77 లక్షలు వసూలు.. మరో బ్యాంకులో తనఖా!

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

కమీషన్ల కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్.. బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బోరబండలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని చిన్నారి మృతి!

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఈసీ తరహా పవర్స్ ఉండాలి: కల్వకుంట్ల కవిత

Big Stories

Advertisement
×