E-Paper
Advertisement

పగటిపూట సైలెంట్ రాత్రైతే వయోలెంట్ ఈ పిల్ల… నలుగురు సార్ల ఎంట్రీతో ట్విస్ట్

పగటిపూట సైలెంట్ రాత్రైతే వయోలెంట్ ఈ పిల్ల… నలుగురు సార్ల ఎంట్రీతో ట్విస్ట్
Advertisement

Korean Drama OTT : స్కూల్ కి ఎవరైనా ఎందుకు వెళతారు ? చదువుకోవడానికి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ సిరీస్ లో ఈ పిల్ల చేసే పనులు చూస్తే ముక్కున వేలేసుకుంటారు. పగలు చాలా సైలెంట్ గా కనిపించే ఈ అమ్మాయి చీకటి పడితే చాలు వయోలెంట్ గా మారిపోతుంది. పెద్దలు మాత్రమే చదివే స్టోరీలు రాస్తూ రచ్చ చేస్తుంది. మరి అలాంటి అమ్మాయి జీవితంలోకి నలుగురు మేల్ టీచర్లు అడుగు పెట్టాక ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే ‘అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్’ (Absolute Value of Romance – 2026) స్టోరీని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ అంతా హైస్కూల్ విద్యార్థిని యో ఐ-జు చుట్టూ తిరుగుతుంది. పగటిపూట ఆమె స్కూల్లో చాలా సైలెంట్‌గా ఉంటూ, ఎవరితోనూ మాట్లాడదు. కానీ రాత్రి వేళల్లో “ఇముక్” అనే కలం పేరుతో ఆన్‌లైన్‌లో బోల్డ్ బీఎల్ అంటే Boys Love వెబ్ నవలలు రాస్తుంటుంది. మొదటి నవలను ఎవరూ చదవకపోయినా, ఆమెకు రాయడం అంటే ప్రాణం. ఒకరోజు ఆమె చదువుకునే స్కూల్‌ కు నలుగురు కొత్త, అందమైన ఉపాధ్యాయులు వస్తారు.

Advertisement

మ్యాథ్స్ జీనియస్ కా ఉ-సు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాడు. జపనీస్ లాంగ్వేజ్ టీచర్ నో దా-జు అల్లరిగా, పీఈ టీచర్ జంగ్ గి-జియోన్ చాలా కైండ్‌గా, లిటరేచర్ టీచర్ యున్ డాంగ్-జు పద్ధతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ నలుగురి వ్యక్తిత్వాలు ఐ-జును ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె వారి ప్రతి ఒక్కరి లక్షణాలను తీసుకుని కొత్త నవల రాయడం స్టార్ట్ చేస్తుంది. ఆ నవల రాత్రికి రాత్రే వైరల్ అవుతుంది. లక్షలాది రీడర్లు దానిని చదివి, కామెంట్లు పెడుతూ, ఫ్యాన్ ఆర్ట్‌లు రాస్తూ ఉంటారు. కానీ ఈ సక్సెస్ ఆమె జీవితంలో ఒక పెద్ద సమస్యను తెస్తుంది.

ఆమె ఫస్ట్ ఎనిమీ అయిన మ్యాథ్స్ టీచర్ కా ఉ-సు ఆ నవల రచయిత్రి ఐ-జు అని కనిపెడతాడు. ఆ రహస్యం బయట పెట్టకుండా ఉండాలంటే ఐ-జు తాను పెట్టే కొన్ని వింత షరతులు పాటించాలని చెబుతాడు. ఆ షరతుల్లో ఒకటి ఆమె అతని మ్యాథ్స్ హోంవర్క్‌లు పూర్తి చేయాలి. ఇలా మొదలైన వారి సంబంధం క్రమంగా కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ నిండిన ప్రయాణంగా తునర్ తీసుకుంటుంది. మరి ఆ తరువాత ఇద్దరి మధ్య ఏం జరిగింది ? ఐ-జు నవలలు ఆమెకు తెచ్చిపెట్టిన కష్టాలు ఏంటి ? వాటి నుంచి బయటపడటానికి ఆమె ఏం చేసింది ? అన్నది తెలియాలంటే ఈ కొరియన్ సిరీస్ ను డోంట్ మిస్.

Advertisement

Also Read : ఫర్నిచర్ షోరూమ్‌లో తీయకూడని తలుపు… లోపలికెళ్తే అంతులేని వింత మిస్టరీ

తెలుగులో ఉందా ?

ఈ సిరీస్ ఒక ఫన్ రైడ్‌లా ఉంటుంది. 16 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్‌లోనూ నవ్వులు, ఎమోషన్స్, స్వీట్ మూమెంట్స్ తో కొరియన్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. 2026 ఏప్రిల్‌లో విడుదలైన కొరియన్ యూత్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో సూపర్ హిట్ అన్పించుకున్న ‘అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్’ సిరీస్ లో… ప్రముఖ నటి కిమ్ హ్యాంగ్-గి, చా హక్-యోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేకపోయినా, ఒరిజినల్ కొరియన్ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

 

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×