E-Paper
Advertisement

కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ (HYDRAA) చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేడెక్కింది. పేదలు, సామాన్యుల ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం, బడా నేతలు, అధికార పక్షానికి అనుకూలంగా ఉండే వారి నిర్మాణాల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఎఫ్‌టీఎల్ గీతలపై అనుమానాలు

Advertisement

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు అనుగుణంగానే ఎఫ్‌టీఎల్ (Full Tank Level) పరిధిని, బఫర్ జోన్ గీతలను మారుస్తోందనే అనుమానాలు ప్రజల్లో రోజురోజుకు బలపడుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. సామాన్యుడికో న్యాయం, అధికార పక్షానికి దగ్గరగా ఉండే వీఐపీలకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

ఓవైసీ కళాశాల వివాదం – ప్రభుత్వ వైఖరి

Advertisement

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన విద్యాసంస్థల నిర్మాణాలు చెరువు పరిధిలోనే ఉన్నాయని ప్రపంచమంతా చూస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అది చెరువులో లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపేందుకు ఉత్సాహం చూపే ప్రభుత్వం, కళ్లెదుటే కనిపిస్తున్న ఇటువంటి పెద్ద ఆక్రమణలను ఎందుకు చూడలేకపోతోందని నిలదీశారు.

Also Read: అమెరికాలో ఏపీ యువతి మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. రూ. 1400 కోట్ల స్కామ్‌తో లింక్?

ఉచిత నేత్ర పరీక్షల సవాల్‌

ప్రభుత్వానికి నిజంగానే కంటిచూపు సమస్య ఉందా లేక రాజకీయ సంకల్పం లోపించిందా అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ కంటి పరీక్షలు చేసిన తర్వాత కూడా చెరువు ఆక్రమణలు కనిపించకపోతే, సమస్య వారి కంటిచూపులో లేదని, వారి స్వార్థ రాజకీయాల్లోనే ఉందని ప్రజలు గ్రహించాలని చురకలంటించారు.

ద్వంద్వ వైఖరి వీడాలి

చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన ద్వంద్వ వైఖరిని వీడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పక్షపాత ధోరణితో, ఎంపిక చేసుకున్న శత్రువులను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదన్నారు. సామాన్య ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తున్న నిజాలు, ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

Also Read: కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

Related News

కమీషన్ల కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్.. బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బోరబండలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని చిన్నారి మృతి!

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఈసీ తరహా పవర్స్ ఉండాలి: కల్వకుంట్ల కవిత

ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కొండాపూర్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి!

భారీగా పెరిగిన బొగ్గు డిమాండ్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఎస్సై దాడి చేశాడని మనస్థాపం చెంది.. పురుగుల మందు తాగిన యువకుడు!

గోవాలో హోరెత్తిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!

Big Stories

Advertisement
×