E-Paper
Advertisement

కారులో మనిషి తల బొమ్మలను వేలాడదీస్తున్న టెస్లా యూజర్స్.. ఎందుకంటే?

కారులో మనిషి తల బొమ్మలను వేలాడదీస్తున్న టెస్లా యూజర్స్.. ఎందుకంటే?
Advertisement

Plastic Toy vs Tesla AI: అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందిన టెస్లా కార్లను చిన్న ట్రిక్ తో మోసం చేస్తున్నారు చైనీయులు. అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే టెస్లా భద్రతా వ్యవస్థను ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం చిన్న ప్లాస్టిక్ బొమ్మల తలలను ఉపయోగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కథ ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంతకీ ఏంటీ కొత్త మోసం?

టెస్లా కార్లలో ఆటోపైలట్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ లాంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉంటాయి. ఇవి పనిచేసే సమయంలో డ్రైవర్ నిజంగా రోడ్డుపైనే దృష్టి పెట్టాడా? లేదా? అనే విషయాన్ని కారు లోపల ఉన్న క్యాబిన్ కెమెరా ఎప్పటికప్పుడు గమనిస్తుంది. డ్రైవర్ రోడ్డుపై శ్రద్ధ చూపించడం లేదని గుర్తిస్తే, సిస్టమ్ హెచ్చరికలు ఇస్తుంది. అవసరమైతే కొన్ని ఫీచర్లను కూడా నిలిపివేస్తుంది.

ప్లాస్టిక్ బొమ్మతో బురిడీ

Advertisement

అయితే ఈ భద్రతా వ్యవస్థను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది డ్రైవర్లు ప్లాస్టిక్ బొమ్మ తలను డ్రైవర్ సీటు దగ్గర ఉంచుతున్నట్లు తెలుస్తోంది. దాంతో కెమెరా ముందు ఒక మనిషి ఉన్నట్లు సిస్టమ్ భావించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో డ్రైవర్ నిజంగా రోడ్డుపై దృష్టి పెట్టకపోయినా, వ్యవస్థ కొంతసేపు మోసపోయే అవకాశం ఉంటుంది. చూడటానికి ఇది చిన్న ట్రిక్‌లా అనిపించినా, దీని వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆటోపైలట్,  ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలు ఇప్పటికీ పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేసే టెక్నాలజీలు కావు. అవి డ్రైవర్‌కు సహాయం చేయడానికి మాత్రమే సాయపడుతాయి. ఎప్పుడైనా పరిస్థితి మారితే వెంటనే స్పందించాల్సిన బాధ్యత డ్రైవర్‌ పైనే ఉంటుంది.

ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

Advertisement

భద్రతా నిపుణులు కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. భద్రతా వ్యవస్థలను మోసగించేందుకు చేసే చిన్న తప్పిదం కూడా పెద్ద రోడ్డు ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే తనతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను పూర్తిగా నమ్మి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఈ టెక్నాలజీలు డ్రైవింగ్‌ ను సులభతరం చేస్తాయే తప్ప, డ్రైవర్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయలేవు. వాహనం నడిపే వ్యక్తి ఎప్పుడూ రోడ్డుపైనే దృష్టి ఉంచి, అవసరమైనప్పుడు వెంటనే స్పందించేలా ఉండాలి.

చిన్న ప్లాస్టిక్ బొమ్మతో అత్యాధునిక భద్రతా వ్యవస్థను మోసగించే ప్రయత్నం చేయడం మంచిదికాదంటున్నారు టెక్ నిపుణులు. ఈ తాజా మోసం టెక్నాలజీలో ఇంకా ఉన్న పరిమితులను చూపించడంతో పాటు, డ్రైవింగ్ సమయంలో మానవ అప్రమత్తతకు ఎంత ప్రాధాన్యం ఉందో మరోసారి గుర్తు చేస్తోంది. భద్రతా వ్యవస్థలు ఎంత అభివృద్ధి చెందినా, చివరికి సురక్షిత ప్రయాణానికి బాధ్యత మాత్రం డ్రైవర్‌ దేనని ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Read Also: మారుతి, మహీంద్రాకు షాక్.. టాప్‌ లో టాటా పంచ్!

Related News

ఇది ఆటోనా.. మినీ బస్సా? బజాజ్ కొత్త డబుల్ డెక్కర్ డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

Triumph 350cc Bike: యూత్ డ్రీమ్ బైక్.. ట్రయంఫ్ 350సీసీ బైక్స్, మళ్లీ ధర పెంపు, ఈసారి ఎంతంటే..

మారుతి, మహీంద్రాకు షాక్.. టాప్‌ లో టాటా పంచ్!

ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో తోపు ఇదే.. ఈ 4 ఈవీ టూ వీలర్స్ కూడా..

మారుతి బంపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.90 వేల డిస్కౌంట్!

400+ కి.మీ రేంజ్‌.. కళ్లు చెదిరే లుక్.. కియా సైరోస్ EV వచ్చేస్తోంది!

రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ హెల్మెట్.. అంత స్పెషల్ ఏంటంటే?

Big Stories

Advertisement
×