BigTV English

Nagar Kurnool: హృదయ విదారకం.. చిన్నారి ప్రాణం తీసిన ఎలుక

Nagar Kurnool: హృదయ విదారకం.. చిన్నారి ప్రాణం తీసిన ఎలుక

Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఎలుక కొరకడంతో కేవలం 40 రోజుల వయసున్న శిశువు మృతి చెందింది. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.


మూడేళ్ల క్రితం పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాములవాసి శివతో నాగనూలుకు చెందిన లక్ష్మీకళకు వివాహమైంది. నిండు గర్భిణీ అయిన లక్ష్మీకళ ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 40 రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో వారి ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు.

చిన్న బాబు ఇంట్లో పడుకుని ఉండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి ఎలుక.. ఆ చిన్నారి ముక్కు కొరికేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐతే పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు. కానీ హైదరాబాద్ వచ్చినా.. శిశువు ప్రాణాలు దక్కకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం పసికందు డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Tags

Related News

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Big Stories

×