Honour Killing: పరిస్థితులు మారుతున్నా దేశంలోని కొన్నిప్రాంతాల ప్రజలు కట్టుబాట్లను కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో హత్యలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. తాజాగా ప్రియుడితో పదే పదే కూతురు ఫోన్‌లో మాట్లాడుతోందని భావించాడు ఆమె తండ్రి. చివరకు పట్టరాని కోపంతో గన్‌తో కూతుర్ని కాల్చిచంపాడు. సంచలనం రేపిన పరువు హత్య యూపీలో వెలుగుచూసింది.
దేశంలో అమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నాయి. పెళ్లీడు అమ్మాయి ఉందంటే దాదాపు అరడజను మంది కబురు పెడుతున్నారు. మరికొందరైతే కులాల గురించి పట్టించుకోవడం లేదు. అమ్మాయి దొరకడమే చాలు పెళ్లి చేసుకోవడం రెడీ అవుతున్నారు.
యూపీలో పరువు హత్య జరిగింది. షామ్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఊహించని విషయాలు బయటపడ్డాయి. కాంధ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబెహ్తా గ్రామం ఉంది. తమ కుమార్తె తన ప్రియుడితో పదే పదే ఫోన్‌లో మాట్లాడటం గమనించాడు ఆమె తండ్రి, సోదరుడు. ఈ విషయంలో ఫ్యామిలీ కలత చెందింది.
చివరకు శనివారం మధ్యాహ్నం సమయంలో కూతురు ఫోన్‌లో మాట్లాడడం గమనించిన తండ్రి, ఇంట్లో గన్ తీసుకుని కూతుర్ని కాల్చి చంపాడు. ఈ విషయంలో తండ్రికి మైనర్ కొడుకు సహాయం చేశాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మృతురాలు 17 ఏళ్ల సనా కాంధ్లాలోని అంబేత గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: జగిత్యాలలో దారుణం.. మెసేజ్ చేశాడని కొట్టి చంపేశారు
నిత్యం ప్రియుడితో కూతురు ఫోన్‌లో మాట్లాడుతోందని కుటుంబ సభ్యులు అనుమానించారు. దీనిపై ఇంట్లో తరచూ వివాదం జరిగేది. చివరకు కూతురికి చెప్పి విసిగిపోయిన తండ్రి, తన కొడుకుతో కలిసి సనాను ఇంటి పైకప్పుపైకి తీసుకెళ్లారు. ఆ తర్వాత స్పాట్‌లో బాలిక మరణించింది.
ఈ ఘటన గురించి స్థానికుల నుంచి సమాచారం జిల్లా పోలీసుల వరకు వెళ్లింది. షామ్లి ఎస్పీ నరేంద్ర ప్రతాప్‌సింగ్ ఫోరెన్సిక్ బృందంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు తండ్రీ-మైనర్ కొడుకుని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ టీనేజర్ యువతి తన ప్రియుడితో నిత్యం ఫోన్‌లో మాట్లాడటమే అందుకు కారణమని తెలిపారు పోలీసులు. నిందితులు ఇద్దరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.