Podarillu Today Episode September 20th :మహాలక్ష్మి లోపలికి రాగానే తలుపు వేయమని చెప్తుంది ఒకప్పుడు నేను లోపలికి వచ్చే తలుపు వేస్తే హాస్టల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనే తలుపు వేయమంటుంది అంటే నా మీద ప్రేమ పెరిగిపోయింది అని చక్రి పంట పండింది అంటూ చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. నేను లోపలికి పిలిచింది ఎందుకంటే పెద్ది గురించి మాట్లాడడానికి అని అనగానే ఏంటి అన్నయ్య గురించి మాట్లాడడానికి పిలిచావా అని చక్రి షాక్ అవుతాడు. అవును మా అన్నయ్య గురించి కాదు మీ అన్నయ్య గురించి మాట్లాడటానికి అతనికి మాత్రమే నేను లోపలికి పిలిచాను అని చెప్పగానే దీనికోసం లోపలికి పిలిచి తలుపు వేయమని చెప్పారా అని చక్రి అనుకుంటాడు.. అసలు చక్రి మహాలక్ష్మి మాటతో చాలా ఫీల్ అయిపోతాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా పెద్ది మల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో మీరు అతనిపై ఒక కనీసం ఉంచండి అని మహా అనగానే అలాగే అని లోపలి నుంచి బయటికి వస్తాడు.
కేశవ కన్నా ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా.. చక్రి ప్లేట్ తో కొట్టి సౌండ్ చేస్తాడు ఏంట్రా ఎందుకు లేపావురా ఇప్పుడు? ఏమైనా పిచ్చ ఏమైనా పట్టిందా నిద్రపోతున్న వాళ్ళనే లేపుతావా ఏంట్రా అనే కేశవ కన్నా ఇద్దరు కూడా చక్రిపై సీరియస్ అవుతారు. ఏం లేదురా అన్నయ్య పెళ్లి సమ్మన్న క్యాన్సల్ అయినందుకు బాధపడి పోకుండా నవ్వుతూ ఉన్నాడు కదా నాకు ఏదో అనుమానంగా ఉంది రా.. నాకు నిజంగానే అన్నయ్య మళ్లీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో అని అనుమానంగా ఉంది మనం రాత్రంతా అన్నయ్యని ఒక గంట కనిపెట్టాలి అని చక్రి ఓ రేంజ్ లో చెప్తాడు. ఆ మాట వినగానే కేశవ కన్నా కూడా అవును నిజమే అన్నయ్యని ఒక గంట కనిపెట్టాలి అని అనుకుంటారు. అయితే ముగ్గురు మూడు షిఫ్ట్ ప్రకారం నిద్ర మేలుకొని అన్నయ్యకు కాపలాగా ఉండాలి అని అనుకుంటారు కానీ కేశవ మాత్రమే అన్నయ్య వెళ్ళిపోకుండా ఉండాలని ఆలోచిస్తాడు.. దానికి మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండేలా చేయాలి అని ముగ్గురు తమ్ముళ్లు మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తారు..
కేశవా ఇంత పొద్దున్నే తలుపేసి ఎక్కడికి వెళ్ళాడు అని మాధవ్ కంగారు పడిపోతూ వెతకడానికి బయటకు వెళ్తాడు. అయితే కేశవ బయట పడుకుని ఉండడం చూసిన మాధవ్ ఏమైంది రా ఎందుకు నువ్వు ఇక్కడ పడుకున్నావు అని అడుగుతాడు. అదేం లేదు అన్నయ్య రాత్రి మీకోసమే నేను ఇక్కడ పడుకున్నాను అని చెప్పగానే ఏమైంది అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని కన్నా అని నిజం అడుగుతాడు మాధవ్. కన్నా అసలు విషయం నేను చెప్పగా నేను ఎక్కడికి వెళ్ళను రా మీరు ఏమి కంగారు పడవద్దు అని అంటాడు. నేనేమీ పెళ్లి చెడిపినందుకు బాధపడడం లేదు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని మాధవ్ ఎంత చెప్పిన సరే వాళ్ళు మాత్రం అన్నయ్య వెళ్ళిపోతాడు అని నాకు అర్థం అవుతుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు.
చక్రి బన్సీ దగ్గరికి వెళ్లి అన్నయ్యకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు… పెళ్లి సంబంధం చెడిపోయిందని చాలా బాధపడిపోతున్నాడు కదా ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని మేము అందరం రాత్రి అంతా నిద్రపోకుండా అన్నయ్య కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము అని చక్రి చెప్పగానే ఏమైంది ఎందుకు మాధవ్ భయ్యా వెళ్ళిపోతాడు అని ఏమీ తెలియనట్లు అడుగుతాడు బన్సీ.. మరి ఏం చేయాలన్న నాకు అర్థం కావట్లేదు అసలు అన్నయ్య చూస్తే నాకు బాధేస్తుంది భయంగా కూడా ఉంది. అసలు ఏమైపోతాడో అని కంగారుగా కూడా ఉంది అని చక్రి అనగానే అతనికి ఒక విషయం గురించి చెప్పాను కదా.. ఏమీ కాదు మీరేమీ బాధపడకండి బాయ్ అని అతను అంటాడు. మా మాధవ్ అన్నయ్యకి మంచి సంబంధం కుదిరితే బాగుంటుంది అని చక్రి అనగానే ఆల్రెడీ మనీషా తో పెళ్లి గురించి మాట్లాడాం కదా చెప్పలేదా మీకు భయ్యా అనేసి అంటాడు. ఆ మాట వినగానే చక్రి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు..
అంతా ఫుల్ హ్యాపీ..
ఇంట్లోని వాళ్లందరికీ చక్రీ ఈ వెళ్లి ఈ నిజాన్ని చెప్తాడు.. ఏంటి మనీషా తో పెళ్లి అని చాలా సంతోషంగా ఉంటారు. అందుకే పెద్ది నిన్నటి నుంచి ఒకటేమైనా నవ్వుతున్నాడు. మొత్తానికి మన పెద్దికి మనిషాకి పెళ్లి అవుతుంది అంటే చాలా సంతోషంగా ఉంది. మనిషా పెద్ద జంట కూడా చాలా బాగుంటుంది అని అందరూ చక్రి ఆ విషయం చెప్పగానే చాలా సంతోషంగా ఉంటారు. ఇక మాధవ్ నీ ఈ విషయం గురించి అడగాలి అని అనుకుంటారు అప్పుడే ఇంట్లోకి మాధవ్ రాగానే చాలా సంతోషంగా హిందీలో మాట్లాడుతూ అందరూ అడుగుతారు. ఆ మాట వినగానే మాతో చాలా సిగ్గు పడిపోతూ ఉంటాడు. మొత్తానికి మాధవ్ పెళ్లి ఫిక్స్ అయింది అని ఇంట్లోని వాళ్ళందరూ సంబరాలు చేసుకోవాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో మాధవ్ కి మనీషా కి పెళ్లి చేస్తారా లేదా అన్నది చూడాలి..