E-Paper
Advertisement

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు
Advertisement

Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.

గురువారం ఉదయం మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్‌ల ఆచూకీ మాత్రం గల్లంతైంది. అధికారులు వాళ్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి మంటలు చెలరేగిన భవనంలో ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. భవనం కూల్చివేతపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×