BigTV English

Wrestlers: రెజ్లర్ల 4 డిమాండ్లు.. బ్రిజ్ భూషణ్ తగ్గేదేలే.. కేంద్రమంత్రి జోక్యం

Wrestlers: రెజ్లర్ల 4 డిమాండ్లు.. బ్రిజ్ భూషణ్ తగ్గేదేలే.. కేంద్రమంత్రి జోక్యం

Wrestlers: రెజ్లర్లు తగ్గేదేలే. బ్రిజ్ భూషణ్ సైతం రాజీనామా చేసేదేలే అంటున్నారు. కుస్తీ యోధులు పట్టిన పట్టు వదలడం లేదు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కంటిన్యూ చేస్తున్నారు. WFI అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే తొలగించాలంటూ భారత ఒలింపిక్‌ సంఘాన్ని ఆశ్రయించారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెజ్లర్లు.


ఒలింపిక్‌ సంఘం ముందు రెజ్లర్లు నాలుగు డిమాండ్లను ఉంచారు.

  1. లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలి.
  2. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలి.
  3. భారత రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేయాలి.
  4. డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలు కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి.

ఇవీ వారి డిమాండ్లు. వీటితో పాటు డబ్ల్యూఎఫ్‌ఐలో ఆర్థిక అవకతవకలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు రెజ్లర్లు. సీనియర్‌ రెజ్లర్లకు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగట్లేదన్నారు. జాతీయ శిబిరంలో అర్హత లేని కోచ్‌లు, ఇతర సిబ్బందిని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు నియమించాడని.. వాళ్లంతా కేవలం ఆయన అనుచరులేనని రెజ్లర్లు తమ ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై చర్చించేందుకు IOA అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో అత్యవసర భేటీ జరిగింది.


ఇక, లైంగిక వేధింపుల ఆరోపణలను WFI అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ ఖండించారు. ఇదంతా రాజకీయ కుట్ర అని.. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలూ వెల్లడిస్తానని చెప్పారు. అయితే, మీడియా ముందుకు వెళ్లొద్దంటూ బ్రిజ్‌ భూషణ్‌కు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఫోన్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మీడియా ముందుకెళ్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయని బ్రిజ్ భూషణ్ ను వారించినట్టు తెలుస్తోంది.

అటు.. ఆందోళన చేస్తోన్న రెజ్లర్లతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వరుస భేటీలు జరుపుతున్నారు. భజ్‌రంగ్‌ పునియా, రవి దహియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లతో గురువారం రాత్రంతా చర్చలు జరిపారు. కానీ, అవి ఫలించకపోవడంతో జగడం కంటిన్యూ అవుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×