E-Paper
Advertisement

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్!

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్!
Advertisement

Minister Seethakka: తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలగా మంచిగా మీరు మమ్మల్ని చూసుకుంటారని మంత్రి సీతక్క అన్నారు. లేని తల్లి గురించి అవమానకరంగా మాట్లాడిన తాత మధును వెంటనే సస్పెండ్ చెయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ విషయంపై కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధు సభ్యత్వం తొలగించాలని అన్నారు. స్పీకర్ పై అనుచిత వాఖ్యల నేపథ్యంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. తాతా మదు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. లేని తల్లిని గుర్తుచేస్తూ అవమానకరంగా మాట్లాడంతో సీతక్క మాట్లాడుతుండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమోషనల్ అయ్యారు.

కంటతడి పెట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్..

స్పీకర్ చైర్‌ని స్పీకర్ గౌరవ మర్యాదలకు భంగం కలిగించేవిధంగా తాతా మధు మాట్లాడటం దారుణం అని అన్నారు. లేని తల్లిని గుర్తుచేసి స్పీకర్ ని బాదపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్ పై అత్యంత అవమానకరంగా మాట్లాడటం దారునం అని సీతక్క ఎమోషనల్ అయ్యారు. రాష్ట్రంలో బ్యాడ్ లాంగ్వేజ్‌కి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ముసుగులో అనేక తప్పుడు కూతలు కూసిన చరిత్ర కేసీఆర్ ది అని మంత్రి సీతక్క అన్నారు. దళితులంటే వారికి నచ్చదని అందుకే స్పీకర్ గా ఉన్న మిమ్మల్ని చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు.

Advertisement

Also read: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

దొర అహంకారం..

దళితులంటే వారికి లెక్కలేదు కాబట్టే దొర అహంకారం దురహంకారం మీపై చూపిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. స్పీకర్ ని తిట్టిన వీడియోస్ అన్నీ తీయించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. మహిళలపట్ల మీరు గౌరవంగా మాట్లాడే విధానం మాకు తెలుసని అలాంటి మిమ్మల్సి దుర్భాషలాడటం దారునం అని అన్నారు. గతంలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పై దారుణంగా మాట్లాడారని గుర్తు చేశారు.

Advertisement

Also read: స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Tags

Related News

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అధ్యక్షా మిమ్మల్నే తిడతారా.. అసెంబ్లీలో తాతా మధుపై సీఎం రేవంత్ ఫైర్!

ఏం పాపం చేశాం? అసెంబ్లీ ఎదుట దుశ్శాసన పర్వం.. సునీత కంటతడి, సబిత ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ వద్ద హైడ్రామా.. నిరసనలు, ప్లకార్డులతో.. కేటీఆర్‌కు గాయాలు- సునీత కన్నీరు

హైదరాబాద్‌లో ఘోరం.. మంటల్లో దగ్దమైన కారు, ఓ వ్యక్తి సజీవదహనం

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

Big Stories

Advertisement
×