KCR Resignation: బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహా ధర్నాచేయాలని నర్ణయించింది. అందుకోసం ఈనెల 6వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.
గత వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అటు అసెంబ్లీకి సైతం హాజరుకాకుండా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మహా ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వివిధ నాయకులు పాల్టోననున్నారు. దీనికకోసం ధర్నా ఏర్పాట్లపై రేపు ఉదయం 9 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనన్నట్టు కాంగ్రెస్ అధికారుల తెలిపారు.
Also read: తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!
ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జులైన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నేతలు పాల్గోననున్నారు. ఆదివారం జరిగే ఈ మహా ధర్నాను విజయవంతం చేసేందుకు కార్యాచరణ, ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు.
Also read: నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ