E-Paper
Advertisement

మద్యం ప్రియులకు షాక్​.. త్వరలో పెరగనున్న ధరలు.. సిఫార్సు చేసిన కమిటీ!

మద్యం ప్రియులకు షాక్​.. త్వరలో పెరగనున్న ధరలు.. సిఫార్సు చేసిన కమిటీ!

Liquor Prices: తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్​ తగలనుంది. అన్ని రకాల మద్యం ధరలను పెంచుతూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. జూన్​ 2న రాష్ట్రావతరణ వేడుకలు జరిపిన తరువాత కొత్త ధరలను అమల్లోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తియినట్టు సమాచారం. మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూసుకోవటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.

సీసం బాటిళ్ల ఎఫెక్ట్..!

పశ్చిమాసియా యుద్ధం సమయంలోనే మద్యం తయారీ కంపెనీలు లిక్కర్​ రేట్లను పెంచాలని డిమాండ్​ చేసిన విషయం తెలిసిందే. విస్కీ, బ్రాందీ, బీరు ఇలా ఏ మద్యాన్ని తీసుకున్నా సీసం బాటిళ్లలోనే నింపుతారు. మార్కెట్లో దొరికే బీరు ధరలో దాదాపు 4‌‌0 శాతం.. విస్కీ, బ్రాందీ రేట్లలో దాదాపు 20 శాతం సీసాల తయారీ ఖర్చే ఉంటుందని సమాచారం. అయితే సీసం బాటిళ్ల తయారీ కోసం గాజు ఫర్నేస్​ లను నిరంతరం మండించాల్సి ఉంటుంది. దీనికి గ్యాస్ తప్పనిసరి.

పెరిగిన తయారీ ఖర్చు

ప్రస్తుతం భారత్ సహజవాయువు అవసరాల కోసం ఎక్కువగా ఖతార్​ పై ఆధార పడి ఉంది. 40 శాతం సహజవాయువులను ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో మొదలైన మిడిల్ ఈస్ట్ యుద్ధంతో.. గ్యాస్​ సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం గాజు బాటిళ్ల ఉత్పత్తి పరిశ్రమలపై ప్రభావం కనబరుస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్​ ధరలు పెరిగిన నేపథ్యంలో గాజు బాటిళ్ల తయారీ ఖర్చు 15 నుంచి 20శాతం వరకు పెరిగినట్టు సమాచారం. దీనికి షిప్పింగ్​ ఛార్జీలు అదనం. ఈ క్రమంలోనే మద్యం ధరను పెంచాలన్న డిమాండ్​ ముందుకొచ్చింది.

సంక్షేమ పథకాల భారం!

మరోవైపు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత బీఆర్​ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయటంతో రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం వడ్డీలు చెల్లించటానికే సరిపోతోంది. ఫలితంగా సంక్షేమ పథకాలను అమలు చేయటం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేకుండా చూసుకోవటంతోపాటు సొంతంగా ఆదాయ వనరులను గణనీయంగా పెంచుకోవటం లక్ష్యంగా ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.

ప్రభుత్వం వద్దకు నివేదిక

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం తెలంగాణలో విక్రయమవుతున్న అన్ని రకాల దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుంచి 15 శాతం ధరలు పెరిగే అవకాశముంది. మద్యం ధరల పెంపు, వ్యాపార సరళి, నూతన ఆదాయ వనరుల పెంపుపై సమగ్ర అధ్యయనానికి ప్రభుత్వం ఇంతకు ముందే ఉన్నతాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అమల్లో ఉన్న మద్యం ధరలు, అక్కడి పన్నుల విధానాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసింది. అనంతరం 25 శాతం నుంచి 30శాతం వరకు ధరలను పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్టు సమాచారం.

Also Read: మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్.. బొక్కబోర్ల పడ్డ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లో విచిత్ర ఘటన!

జూన్ 2 లోపు తుది నిర్ణయం!

అయితే, ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ధరలు పెంచితే సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం మద్యం ధరల పెంపును 10 నుంచి 15శాతం మధ్యలోనే పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. మద్యం ధరల పెంపునకు సంబంధించిన ఫైనల్​ రిపోర్టు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. జూన్​ 2వ తేదీలోపు దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఎక్సయిజ్ శాఖ కొత్త ధరల జీవోను విడుదల చేయనుంది. ఫలితంగా ఆర్డినరీ బ్రాండ్లు, మీడియం బ్రాండ్లతోపాటు లగ్జరీ, ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది.

Also Read: ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. బట్టలు బాగా ఉతికేది ఏది? ఇంటికి ఏ వాషింగ్ మిషన్ బెస్ట్?

Related News

తెలంగాణలో బీజేపీ సరికొత్త వ్యూహం.. జూన్ నెలలో చేయబోయే కార్యక్రమాలివే..?

అన్న ఎన్టీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి పాలన.. మహేష్ కుమార్ గౌడ్

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్!

రేవంత్ సర్కార్‌పై కవిత ధ్వజం.. ‘టీఆర్ఎస్’లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్థన్!

అమ్మబాబోయ్.. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు!

భువనగిరి కలెక్టరేట్‌లో మంత్రుల కీలక సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం

టీడీపీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు.. ఎన్టీఆర్ కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల పోటీ, మేటరేంటి?

Big Stories

×