E-Paper
Advertisement

భువనగిరి కలెక్టరేట్‌లో మంత్రుల కీలక సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం

భువనగిరి కలెక్టరేట్‌లో మంత్రుల కీలక సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం
Advertisement

Paddy Procurement: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ధాన్యం కొనుగోళ్ల సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..

Advertisement

తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. యాసంగి పంటకు సంబంధించి ఇప్పటికే రూ.11వేల కోట్లు రైతులకు చెల్లించామని, దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

అధికారులకు కీలక ఆదేశాలు

Advertisement

రాబోయే రుతుపవనాలను దృష్టిలో ఉంచుకుని, రానున్న 4-5 రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా మిల్లులకు చేర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రవాణా ఇబ్బందులు రాకుండా ఇసుక లారీలను సైతం ధాన్యం తరలింపునకు ఉపయోగించాలన్నారు. బెంగాల్ ఎన్నికల వల్ల హమాలీల కొరత ఏర్పడినప్పటికీ, ప్రొక్యూర్మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌కు సూచించారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించడం తప్ప, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సహకారం అందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే రూ.16,470 కోట్లు అదనంగా ఖర్చు చేసిందని మండిపడ్డారు.

విపక్షాలపై పొంగులేటి ధ్వజం

రైతుల పేరిట బస్సు యాత్రలు చేస్తున్న ప్రతిపక్షాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వడ్ల గురించి కనీస అవగాహన లేని వారు కూడా ఈరోజు మాట్లాడుతున్నారని, గతంలో రైతులను సంకెళ్లు వేసి వేధించిన వారు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Also Read: ఒకవైపు స్పీచ్‌లు.. మరోవైపు రికార్డింగ్ డాన్సులు.. మహానాడుపై రోజా సెటైర్లు

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×