E-Paper
Advertisement

Harish Rao: పురపోరులో బీఆర్ఎస్ జోరు.. ప్రజావ్యతిరేకతకు నిదర్శనం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: పురపోరులో బీఆర్ఎస్ జోరు.. ప్రజావ్యతిరేకతకు నిదర్శనం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

Harish Rao: అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి పురపోరులో బీఆర్ఎస్ నేతలు విజయకేతనం ఎగురవేశారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన BRS పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

700 పైగా వార్డుల్లో గెలుపు..

సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగం మెుత్తం ఒక్కటై పనిచేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు.

‘ఆ శక్తి బీఆర్ఎస్‌కే ఉంది’

Advertisement

పల్లె, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయని సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శించారు. అందువల్లనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే కొరడాతో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మొన్న పంచాయితీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read: Madhya Pradesh Crime: దేశంలో ఘోరం.. నగ్న వీడియోలతో బెదిరించి.. విద్యార్థినిపై 4 కార్లలో అత్యాచారం

ఫలితాలతో కొత్త ఉత్సాహాం

Advertisement

అధికార పక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉంటూ సాధించిన ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. పాలన గాలికి వదిలి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతున్న రేవంత్ సర్కారు భరతం పడుతూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఫైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Also Read: Street Dog: ఫేమస్ స్ట్రీట్ డాగ్‌ను.. కారుతో తొక్కించిన డ్రైవర్.. పోలీసులు ఏం చేశారంటే?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×