BigTV English

Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..

Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..
kcr reddy

Telangana: రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పారని రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా మాటలు, ప్రకటనలకే పరిమితమయ్యాయంటూ ధర్నాకు దిగారు. బంజారాహిల్స్‌లో మినిష్టర్స్ క్వార్టర్స్ దగ్గర రెడ్డి సంఘం ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేశారు.


ప్లకార్డులు పట్టుకొని చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు మరింత ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన రెడ్డి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రెడ్డి సామాజిక వర్గంలో వెనకబడిన వారిని ఆదుకుంటామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. వారి కోసం రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొంత కాలంగా ఈ వర్గం నేతలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న రెడ్డి మంత్రులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల నాటికి ఇచ్చిన హామీ నెరవేర్చేలా.. పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు రెడ్డి నేతలు.


Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×