TGSRTC: భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్ ధరలో పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తస్తదని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది. ముందస్తు రిజర్వేషన్ కోసం ఆర్టీసీకి సంబంధించిన వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
Also Read: జీప్ ఎక్కి మాట్లాడటం కాదు.. ప్రజల కష్టాలను చూడాలి: చామల
ఇదిలా ఉంటే.. ఎప్పుడు ఇటువంటి ఆపత్కార సమయాల్లో సాయం అందించడంలో ఆర్టీసీ తన వంతు పాత్రను పోషిస్తుంది. బస్సులు అదనంగా నడపడం కానీ, టికెట్ల ధరలలో రాయితీ ఇవ్వడం గానీ.. ఇలా ఏదో విధంగా ఆర్టీసీ జనాలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుటుంది. అదేవిధంగా ప్రయాణికులుకు మేలు చేసే విధంగా ఆపత్కార సమయాల్లో నిర్ణయాలు తీసుకుని వారికి హెల్ప్ చేసిన కండక్టర్లు, బస్సు డ్రైవర్లు, సిబ్బందిని కూడా యాజమాన్యం ఎప్పటికప్పుడు గుర్తించి వారికి సన్మానం చేస్తుంటది. తాజాగా ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతున్న తరుణంలో తన వంతు పాత్రను పోషించింది. ప్రయాణికులకు ఏదో విధంగా మేలు చేసి ఆదుకోవాలన్న ఉద్దేశంతో టికెట్ ధరల్లో ప్రయాణికులకు రాయితీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో ఈ నిర్ణయం తీసుకుని మంచి పని చేసిందంటూ ఆర్టీసీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: హరీశ్‌రావు.. ఫస్ట్ ఆ మైకం నుంచి బయటకు రా.. ఎందుకు అనవసరంగా అరుస్తున్నావ్? : జగ్గారెడ్డి
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు, వరదలు వచ్చి జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇరు రాష్ట్రాల్లోనూ జన జీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల పలువురు మృత్యువాతపడ్డారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో చాలాచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వరదలు భారీగా ముంచెత్తడంతో అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. పూర్తిగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆర్తనాదాలు చేశారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి వరద బాధితులను కాపాడింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఇటు ఇండ్లు కోల్పోయినవారికి ఆర్థిక సాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.