BigTV English

Gandhi Hospital: భార్యతో గొడవ… బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్… చివరికి గాంధీ వైద్యుల అద్భుతం!

Gandhi Hospital: భార్యతో గొడవ… బ్లేడ్లు మింగిన ఆటో డ్రైవర్… చివరికి గాంధీ వైద్యుల అద్భుతం!

Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని నిరూపించారు. మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 37 ఏళ్ల ఆటోడ్రైవర్ మహమ్మద్ ఖాజా తన జీవితాన్ని ముగించుకోవాలని తీసుకున్న నిర్ణయం క్షణాల్లోనే ప్రాణాపాయ స్థితికి దారితీసింది. కుటుంబంలో జరిగిన చిన్న గొడవ పెద్ద సమస్యగా మారి, ఆవేశంతో 8 షేవింగ్ బ్లేడ్లను రెండేసి ముక్కలుగా చేసి మింగేసిన ఖాజాను గాంధీ వైద్యులు ఆపరేషన్ చేయకుండా సురక్షితంగా బయటపెట్టడం అరుదైన ఘనతగా నిలిచింది.


ఈ నెల 16వ తేదీ రాత్రి, ఇంట్లో జరిగిన చిన్న గొడవ తర్వాత ఖాజా తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. భార్యతో వాగ్వాదం అనంతరం తనకు బతకలేని పరిస్థితి ఏర్పడిందని భావించి, బాత్రూమ్‌లోకి వెళ్లి షేవింగ్ బ్లేడ్లను ముక్కలు చేసి మింగేశాడు. కొద్దిసేపట్లోనే అతని పొట్టలో తీవ్రమైన నొప్పి మొదలైంది. బాధతో అరిచిన ఖాజాను చూసి భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రి అత్యవసర విభాగంలో డ్యూటీ వైద్యులు పరిస్థితి గమనించి వెంటనే జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని అప్రమత్తం చేశారు. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ల ద్వారా ఖాజా కడుపులో మొత్తం 16 బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ సమయంలో పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉండటంతో, బృందం తొలుత ఎండోస్కోపీ ద్వారా బ్లేడ్లను తీయాలనుకుంది. అయితే, ఆ ప్రక్రియలో అన్నవాహిక, కడుపు గోడలకు గాయాలై రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని గుర్తించారు.


ఈ క్లిష్ట పరిస్థితిలో వైద్యులు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయ మార్గం అన్వేషించారు. చివరికి ‘ప్రోటాన్ పంప్’ అనే ప్రత్యేక వైద్య విధానాన్ని ఎంచుకున్నారు. ఈ పద్ధతిలో రోగికి ఏ ఆహారమూ, నీటిని ఇవ్వకుండా, పూర్తిగా ఇంట్రావీనస్ (ఐవీ) ద్రవాల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందజేస్తారు. దీంతో బ్లేడ్ ముక్కలు క్రమంగా పేగుల ద్వారా కదిలి సహజసిద్ధంగా మలంతో బయటకు రావడం ప్రారంభమైంది.

మూడు రోజులపాటు వైద్యులు గంట గంటకూ ఖాజా పరిస్థితిని పర్యవేక్షించారు. చివరికి మూడో రోజుకల్లా 16 బ్లేడ్ ముక్కలన్నీ మల విసర్జన ద్వారా సురక్షితంగా బయటకు వచ్చాయి. మరోసారి ఎక్స్‌రే, స్కాన్ చేసి, కడుపులో ఎలాంటి ముక్కలు మిగలలేదని నిర్ధారించుకున్న తర్వాత వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Congress PAC: ఓటు చోరీపై కాంగ్రెస్ దూకుడు.. PAC కీలక నిర్ణయాలు!

డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఇది చాలా అరుదైన కేసు. చిన్న తప్పిదం కూడా ప్రాణాపాయానికి దారితీసే పరిస్థితి. కానీ బృందం సమిష్టి కృషితో, శస్త్రచికిత్స అవసరం లేకుండానే విజయవంతంగా చికిత్స పూర్తి చేయగలిగాం. రోగి పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు.

మూడు రోజుల పాటు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్న ఖాజా, 21వ తేదీ నాడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను తన కుటుంబ సభ్యుల వెంట ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ సంఘటనతో స్థానికులు గాంధీ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆపరేషన్ చేయకుండానే, అత్యంత ప్రమాదకర స్థితి నుంచి రోగిని బయటకు తీసుకువచ్చినందుకు వైద్యులకు సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఏ సమస్య వచ్చినా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ప్రమాదకర ఫలితాలను కలిగిస్తాయో. డాక్టర్లు ప్రజలకు సూచిస్తూ, ఎంతటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి, తక్షణ సహాయం కోసం కౌన్సెలింగ్ తీసుకోవాలని అన్నారు.

Related News

Revanth Reddy: బీసీల హక్కుల కోసం కట్టుబడి ఉన్నాం.. గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Congress PAC: ఓటు చోరీపై కాంగ్రెస్ దూకుడు.. PAC కీలక నిర్ణయాలు!

Hyderabad rains: హైదరాబాద్ వర్షాల కొత్త అప్‌డేట్.. వాతావరణం చల్లగా, గాలులు వేగంగా.. తస్మాత్ జాగ్రత్త!

Bhupalpally: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్

Suryapet Crime: పట్ట పగలే ముగ్గురిపై హత్యాయత్నం.. వీడియో వైరల్..

Big Stories

×