Bigg Boss Noel: ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఎక్కువగా తమకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే అందులో కొంతమంది ఇలా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నోయెల్ సీన్ (Noel Sean) తాజాగా ఒక కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశారు..ఇందుకు సంబంధించిన వీడియోని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకోవడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు నోయెల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నోయెల్ సినిమాలు..
ఆర్జే, మ్యూజిక్ కంపోజర్, రైటర్, సింగర్, యాక్టర్ ఇలా పలు విభాగాలలో సత్తా చాటుతూ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు సొంతం చేసుకున్నారు నోయెల్ సీన్. ఇప్పటివరకు ఇంత టాలెంట్ ఉన్నా.. సరైన గుర్తింపు మాత్రం రాలేదని చెప్పాలి. 2006లో ‘సంభవామి యుగేయుగే’ అనే సినిమాతో కెరియర్ ఆరంభించిన ఈయన.. ఆ తర్వాత ఈగ, మగధీర, మంత్ర లాంటి పెద్ద పెద్ద సినిమాల్లోనే నటించారు. సహాయక నటుడు పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చేసి మెప్పించారు. అటు కుమారి 21ఎఫ్ సినిమాలో విలనిజం బాగా పండించడంతో ఇతనికి అవకాశాలు కూడా వచ్చి పడ్డాయి.
లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్..
అలా పడి పడి లేచే మనసు , రంగస్థలం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, నాన్నకు ప్రేమతో, ప్రేమమ్, వలయం, రంగవల్లి, పొట్టేలు తదితర చిత్రాలలో నటించార.. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కూడా పాల్గొన్నారు. కానీ అనారోగ్య సమస్యలతో మధ్యలోనే వచ్చేసారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా గడిపేస్తున్న ఈయన ఒక ఖరీదైన కార్ సొంతం చేసుకున్నారు.. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోని షేర్ చేయగా.. అందులో తన తల్లి ఈ చేతుల మీదుగా నోయెల్ కారును కొనుగోలు చేసినట్లు చూపించారు.
కార్ ప్రత్యేకతలు.. ఫీచర్స్..
కారు ప్రత్యేకతల విషయానికి వస్తే.. మహేంద్ర కంపెనీకి చెందిన బీఈ6 మోడల్ ఎలక్ట్రిక్ కారు.. దీని ధర మార్కెట్ ప్రకారం సుమారుగా రూ.20 లక్షల వరకు ఉంటుంది.. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు నోయెల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే మహేంద్ర యొక్క కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యు వి మోడల్ ఇది..ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన INGLO ఫ్లాట్ ఫారం పై నిర్మించబడింది.. ముఖ్యంగా అనేక వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ ప్యాక్ మోడల్ బేస్ వన్ నుండి 79 కిలోమీటర్ తో కూడిన టాప్ వేరియంట్ ప్యాక్ త్రీ వరకు ఉంటుంది . ఇటీవలే ఈ కంపెనీ బీఈ సిక్స్ బ్యాట్ మాన్ ఎడిషన్ ని కూడా లాంచ్ చేసింది.. ఇది 682 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బిఈ సిక్స్ బ్యాట్ మాన్ ఎడిషన్ ఆగస్టు 23 నుండి బుకింగ్ లు ప్రారంభమవగా.. సెప్టెంబర్ 20 నుండి డెలివరీలు స్టార్ట్ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
ALSO READ:Nara Rohit: పొలిటికల్ ఎంట్రీపై హీరో క్లారిటీ.. ఆ అపోహలకు చెక్!
?utm_source=ig_web_copy_link